టీకా తీసుకున్న తర్వాత రక్తదానం చేయొచ్చా లేదా.. ఇది తెలుసుకోండి..?
ముఖ్యంగా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొన్ని రకాల పనులు చేయొచ్చా.. లేదా అనే దానిపై అనుమానాలు అందరిలో తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఎంతో మంది రక్తదానం చేసే వారు ఇక వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్త దానం చేయవచ్చా లేదా అన్నదానిపై ఆందోళన చెందుతున్నారు. అయితే తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది నేషనల్ బ్లడ్ ట్రాన్స్ ఫ్యూషన్ కౌన్సిల్. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నిర్ణీత గడువు వరకు ఎవరు కూడా రక్త దానం చేయడానికి ముందుకు రావద్దు అంటూ సూచించింది.
కరోనా వ్యాక్సిన్ రెండవ డోసు తీసుకున్న తర్వాత 28 రోజుల వరకు కూడా రక్తదానం చేయకూడదు అంటూ నేషనల్ బ్లడ్ ట్రాన్స్ ఫ్యూషన్ కౌన్సిల్ తెలిపింది. అంతేకాకుండా తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 56 రోజుల వరకు కూడా బ్లడ్ డొనేట్ చేయడానికి దూరంగానే ఉండాలి అంటూ సూచించింది. ఏ రకమైన టీకా తీసుకున్నప్పటికీ ఇలాంటి నిబంధన వర్తిస్తుందని.. రెండవసారి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత బాడీలో యాంటీబాడీలు ఎంతగానో వృద్ధి చెందుతాయి అంటూ నేషనల్ బ్లడ్ ట్రాన్స్ ఫ్యూషన్ కౌన్సిల్ తెలిపింది. ఇలా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తదానం చేయొచ్చా లేదా అని ఎంతోమందిలో నెలకొన్న అనుమానాలకు క్లారిటీ ఇస్తూ.. అనుమానాలకు తెరదించింది నేషనల్ బ్లడ్ ట్రాన్స్ ఫ్యూషన్ కౌన్సిల్.