ఈ ఫ్యాన్ ఫీచర్స్ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Satvika
గాలి కోసం ఫ్యాన్స్ ను ఎక్కువగా వాడతారు. అందులో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువగా వీటిని వాడతారు. అయితే ఇప్పటివరకు మార్కెట్ లోకి వచ్చిన ఫ్యాన్స్ కేవలం గాలి కోసం వాడితే, ఇప్పుడు వచ్చిన ఫ్యాన్ మాత్రం ఏకంగా గాలినే శుభ్రం చేస్తుందట.. ఇది నిజమే మరి ఆ ఫోన్ ప్రత్యేకతలు ఎంటి ధర ఎంత అనే విషయాల గురించి ప్రత్యేకంగా తెలుసుకుందాం. కన్జుమర్ డ్యూరబుల్ కంపెనీ హావెల్స్ ఇండియా లిమిటెడ్ గాలిని శుద్ధి చేసే సీలింగ్ ఫ్యాన్‌ను ఆవిష్కరించింది. ఫలితంగా ఇలాంటి సాంకేతికతను ఆవిష్కరించిన తొలి భారత కంపెనీగా రికార్డులకెక్కింది. మూడు దశల్లో గాలిని శుద్ధి చేసే ఈ ఫ్యాన్ ఖరీదు రూ. 15 వేలు మాత్రమే.


ఈ ఫ్యాన్ గంటలకు 130 క్యూబిక్ మీటర్ల గాలిని శుద్ధి చేస్తుంది. దీనిపేరు 'స్టెల్త్ ప్యూరో ఎయిర్'. ఆరోగ్య వంతమైన జీవన విధానాన్ని కోరుకునే వారిని ఉద్దేశించి ఈ ఫ్యాన్‌ను కంపెనీ ఆవిష్కరించింది. అన్ని ఫ్యాన్‌లలా ఇది గాలిని నలువైపులకు పంపించడమే కాకుండా అదే సమయంలో శుద్ధి చేస్తుంది. ఇందులో హెచ్‌ఈపీఏ ఫిల్టర్‌ను కూడా అమర్చారు. దాంతో ఈ ఫ్యాన్ గాలిని శుద్ది చేసి ఇస్తుంది. ఈ ఫ్యాన్ కార్బన్ ను యాక్టివేట్ చేస్తుంది. ప్రీఫిల్టర్ విష పదార్థాలను గ్రహించి స్వచ్చమైన గాలిని విడుదల చేస్తుంది. ఇలా ఫ్యాన్ గాలిని ముందుగా శుద్ది చేసి అందిస్తుంది.


 అంతేకాదు ఈ ఫ్యాన్ లో మరికొన్ని ఫీచర్లు ఉన్నాయి. రిమోట్ కంట్రోల్ ఆపరేషన్, కిందివైపు లైటు, ఎల్‌ఈడీ ఎయిర్ ప్యూరిఫైర్ ఇండికేటర్ మొదలైనవి ఉన్నాయి. అలాగే, ఈ ఫ్యాన్‌లో ఎరోడైనమిక్ బ్లేడ్స్‌ను ఉపయోగిండంతో ఎలాంటి శబ్దం లేకుండా గాలిని విడుదల చేసింది. ఇకపోతే కంపెనీ 'హావెల్స్ ఫ్యాన్‌మేట్' ఫ్యాన్‌ను కూడా ఆవిష్కరించింది. ఇందులోనూ కార్బన్ ఫిల్టర్లు ఉన్నాయి. దీనికితోడు గాలిని మనకు ఇష్టమైన దశలో మరల్చుకునే సదుపాయం కూడా ఉండటం అద్భుతమని చెప్పాలి.మూడు గంటలపాటు బ్యాటరీ బ్యాకప్ ఉంది. యూఎస్‌బీ కేబుల్ ద్వారా బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చు.. ఈ కేబుల్ తో ల్యాప్ టాప్ కు కనెక్ట్ చేసుకొని ఫ్యాన్ ఆపరేషన్స్ చేసుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: