వైసీపీ మంత్రులు అడ్డంగా దొరికిపోయారే..!

VUYYURU SUBHASH
వైసీపీ మంత్రుల్లో ఫైర్ బ్రాండ్లుగా ఉన్న కొడాలి నాని, పేర్ని నాని.. ఇటీవ‌ల కాలంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు కుమారుడిపై కామెంట్లు చేస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా లోకేష్ చ‌దువుపై ఇద్ద‌రూకూడా విమ‌ర్శ‌లు గుప్పించారు. అస‌లు లోకేష్‌కు స్టాన్ ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ స‌ర్టిఫికెట్ ఎలా ఇచ్చిందో.. చూస్తామన్నారు. అంతేకాదు.. వ‌ర్సిటీకి తాము లేఖ రాసి.. గుట్టును బ‌య‌ట పెడ‌తామ‌ని స‌వాల్ విసిరారు. అయితే.. దీనికి ప్ర‌తిగా .. టీడీపీ నుంచి కూడా అంతే ఘాటు కౌంట‌ర్ ఎదురైంది. ప‌దో త‌ర‌గ‌తి కూడా చ‌ద‌వ‌ని వైసీపీ మంత్రులు కొంద‌రు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌దవిలో ఉన్న లోకేష్‌పై అవాకులు చెవాకులు పేల‌డాన్ని టీడీపీ నేత బుచ్చి రాంప్ర‌సాద్ విమ‌ర్శించారు.
అండర్ గ్రాడ్యుయేట్‌ను అమెరికాలో చేసిన లోకేష్‌.. త‌ర్వాత స్టాన్ ఫ‌ర్డ్‌లో చ‌దువుకున్నార‌ని.. ఇది ప్ర‌పంచంలోనే టాప్ యూనివ ర్సిటీ అని వివ‌రించారు. `` మంత్రులు లేఖ‌లు రాయాల‌ని అనుకుంటే.. ముందుగా జ‌గ‌న్ ఎక్క‌డ చ‌దువుకున్నాన‌ని చెబుతు న్నాడో.. ఆ వ‌ర్సిటీకి లేఖ‌లు రాయాల‌ని.. అదేవిధంగా మీరు చ‌దువుకున్న సంస్థ‌ల‌కు కూడా లేఖ‌లు రాస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాల‌ని దుయ్య‌బ‌ట్టారు. లోకేష్‌పై కామెంట్లు చేస్తున్న నాయ‌కులు.. ఒక్క గంట‌.. ఆయ‌న‌తో చ‌ర్చించేందుకు రెడీనా ? అంటూ.. స‌వాల్ విసిరారు. ఎక్క‌డైనా.. ఏ ఛాన‌లైనా..చ‌ర్చించేందుకు లోకేష్ సిద్ధ‌మేన‌ని అన్నారు.  సీఎం జ‌గ‌న్ కుమార్తె కూడా అమెరికాలోనూ... ప్ర‌స్తుతం బ్రిట‌న్‌లోనూ చ‌దువుతున్నార‌ని.. ఆమె కూడా సీటు కొన్నార‌నే వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని అన్నారు.
మీకు స్నేహితుల గురించి చెప్పాలంటే.. గ్లాస్ మేట్స్... టేబుల్ మేట్స్ త‌ప్ప ఎవ‌రూ ఉండ‌ర‌ని.. మీతో పేకాట ఆడుకున్న‌వారే క‌నిపిస్తార‌ని.. మంత్రుల‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. విదేశీ విశ్వ‌విద్యాల‌యాల్లో చ‌దివే అర్హ‌త ఉన్న మంత్రులు ఎవ‌రైనా.. ఉంటే.. రావాల‌ని.. తానే స్వ‌యంగా వారిని అక్క‌డ చేర్చి ఎన్నారైల నుంచి విరాళాలు సేక‌రించి ఫీజులు క‌డ‌తాన‌ని స‌వాల్ విసిరారు. ద‌మ్ము ధైర్యం లేని మంత్రులు లోకేష్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం మానుకోవాల‌ని సూచించారు. అర్ధంలేని మాట‌లు మానుకోవాల‌ని బుచ్చి రాం ప్ర‌సాద్ హెచ్చ‌రిక‌లు చేశారు. మొత్తానికి వైసీపీ మంత్రుల‌కు టీడీపీ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి దీనికి మంత్రులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: