ప్రచారం నుంచి పారిపోయిన అభ్యర్థి.. ఎందుకో తెలుసా..?

praveen
పశ్చిమ బెంగాల్ లో మరికొన్ని రోజులు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మొత్తం వాడివేడిగా మారిపోయాయి. పశ్చిమ బెంగాల్ లోని అన్ని పార్టీలు కూడా తమదే విజయం అంటూ ధీమాతో ఉన్నాయి. ఈ క్రమంలోనే గెలుపు గుర్రాలని రంగంలోకి దింపి గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి అన్ని పార్టీలు. ఈ క్రమంలోనే అటు ప్రధాన పోటీ  తృణమూల్  కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య ఉంది అన్నది అర్థమైంది. ఈ క్రమంలోనే బీజేపీ పెద్దలు అందరూ కూడా రంగంలోకి దిగి అటు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార హోరుతో దూసుకుపోతున్నారు.



 అదే సమయంలో అటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కూడా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ప్రజలందరినీ తమ వైపు తిప్పుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మరోసారి తాము అధికారంలోకి వస్తేనే పశ్చిమబెంగాల్ అభివృద్ధి సాధ్యమవుతుంది అంటూ ప్రజలను ఆకర్షించేందుకు ఎన్నోరకాల ప్రసంగాలు కూడా ఇస్తున్నారు. ఇకపోతే ఎన్నికల ప్రచారం అన్న తర్వాత ఇక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల వెంట వందల సంఖ్యలో కార్యకర్తలు వస్తూ మద్దతుగా ప్రచారం నిర్వహించడం చూస్తూనే ఉంటారూ. అంతేకాకుండా ఇక అటు ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్న అభ్యర్థికి ఎంతో రక్షణగా కూడా ఉంటారు కార్యకర్తలు.



 కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా సీన్ రివర్స్ అయ్యింది. ఇటీవలే పశ్చిమబెంగాల్లో నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సాయోని ఘోష్ ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్ తరపున అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. అయితే ఇటీవల  తన నియోజకవర్గం అయిన అసన్సోల్ అసెంబ్లీలో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఆమెకు వింత అనుభవం ఎదురైంది.  ఆమె ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఇక ఆమె వెంట మద్దతు తెలిపేందుకు వచ్చిన ఎంతో మంది కార్యకర్తలు ఆమె చుట్టూ గుంపుగా చేరి వేధించేందుకు ప్రయత్నించారట. ఇక వెంటనే అప్రమత్తమైన సదరు మహిళ  వారి నుంచి తప్పించుకొని పరుగులు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన అంశం ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: