కరోనా కట్టడికి జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక అవన్నీ బంద్..?
ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. వైరస్ కంట్రోల్ చేయడంలో భాగంగా ఇటీవలే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లోని పలు ఆలయాలలో నిత్య అన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది. నిత్య అన్నదాన విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. దాదాపుగా అన్ని ఆలయాలలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిలిపి వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక అన్నదాన కార్యక్రమం అంటే అక్కడ ఎక్కువగా గుమి గూడి ప్రజలు ఉండే అవకాశం ఉంది అంతే కాకుండా వారిని కంట్రోల్ చేయడం దాదాపు అసాధ్యం అని చెప్పవచ్చు.
ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో మరింత దారుణంగా వైరస్ కేసులు పెరిగే అవకాశం ఉంది అని భావించిన ప్రభుత్వం అన్నదాన కార్యక్రమాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక అన్నదాన కార్యక్రమం నిర్వహించకుండా అన్న దానంలో అందించే అన్ని రకాల ఆహార పదార్ధాలను కూడా పాకెట్ల రూపంలో క ప్రజలందరికీ అందించేందుకు నిర్ణయించింది. ఇక ఆలయాలు కూడా మూసేస్తారా అనే భయం కూడా ప్రజల్లో నెలకొంది. అయితే ఆలయాల మూసివేయకుండా ఉండాలి అంటే అటు ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోండి వైరస్ ను కట్టడి చేయడంలో భాగస్వాములు కావాలని అలా జరగకుండా నిర్లక్ష్యం వహిస్తే ఆలయాల మూసివేత కూడా జరగడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. ఏదేమైనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని అన్నదాన కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం మాత్రం ఒక శుభపరిణామం అని అంటున్నారు