తిరుపతి బై పోల్ వార్: బాబు ఫిక్స్ అయిపోయారా?
జగన్ ప్రజలు మెచ్చే పాలన చేస్తుండటంతోనే ఇలాంటి ఫలితాలు వస్తున్నాయనే చెప్పొచ్చు. అయితే జగన్‌ని దెబ్బతీయడానికి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. జగన్ సీఎం పీఠం ఎక్కిన దగ్గర నుంచి అధికార పార్టీపై బాబు విమర్శలు చేస్తూనే వచ్చారు. అసలు జగన్ వల్ల ప్రజలు మరిన్ని ఇబ్బందులకు గురవతున్నారనే రేంజ్ లో బాబు ప్రచారం చేశారు. కానీ బాబు చేసిన ప్రచారం జనంలోకి వెళ్లలేదని తాజా ఎన్నికలు రుజువు చేశాయి.
అసలు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బాబు, నారా లోకేష్‌లు జనం లోకి వెళ్ళి మరీ జగన్ పై విమర్శలు చేశారు. కానీ జగన్ మాత్రం సచివాలయం దాటలేదు. మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులే చూసుకున్నారు. ఇక జగన్ మీద ఉన్న ప్రజల నమ్మకం ఏంటో స్థానిక ఎన్నికల్లో రుజువైంది. ఇక ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలో కూడా ఇలాంటి ఫలితమే వస్తుందని తెలుస్తోంది. తిరుపతిలో వైసీపీ భారీ మెజారిటీతో గెలవబోతుందని ప్రచారం జరిగిపోతుంది.
ఇక టీడీపీ వైసీపీకి పోటీ ఇచ్చి, ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటుందా లేదా అనేదే ప్రధాన ప్రశ్న. ఇక ఓటమి ఖాయం కావడంతోనే బాబు తిరుపతిలో ప్రచారం చేయడం కష్టమని తెలుస్తోంది. ఒకవేళ చేసిన ఒకటి లేదా రెండు రోజులే చేయొచ్చని సమాచారం. మొత్తానికైతే తిరుపతిలో ఓటమిని బాబు ముందే ఫిక్స్ చేసుకున్నారని వైసీపీ నుంచి సెటైర్లు మాత్రం బాగానే వస్తున్నాయి.