హైకోర్టు జడ్జిలకు అదిరిపోయే గిఫ్ట్ అందించబోతున్న జగన్..?

Chakravarthi Kalyan
ఆంధ్రప్రదేశ్‌లో న్యాయవ్యవస్థకూ ఏపీ సీఎం జగన్‌ కూ ఉన్న వైరం సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఏపీ సీఎం జగన్ ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల తీరుపై తీవ్రమైన విమర్శలు చేస్తూ.. ఏకంగా సుప్రీం కోర్టు జస్టిస్ ఎన్‌వీ రమణ వారిని ప్రభావితం చేస్తున్నారని లేఖ రాశారు. అప్పట్లో ఇది చాలా సంచనలంగా మారింది. ఆ తర్వాత ఆ పిటిషన్‌ను సీజేఐ కొట్టేశారు. జస్టిస్‌ ఎన్వీ రమణ సీజేఐ అయ్యేందుకు లైన్ క్లియర్ చేశారు.

అయితే ఇప్పుడు ఏపీ హైకోర్టు జడ్జిలకు సీఎం జగన్ ఓ బ్రహ్మాండమైన కానుక ఇవ్వబోతున్నారు. హైకోర్టు న్యాయ మూర్తుల వినియోగానికి కొత్తగా 20 కియా కార్లు కొనుగోలుకు జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కొక్కటి 31.5 లక్షల రూపాయల చొప్పున 20 కియా కార్నివాల్ లిమోసిన్స్ కార్లు కొనుగోలు చేసేందుకు ఏపీ సర్కారు పచ్చజెండా ఉపింది. ఇందుకు అవసరమైన 6.3 కోట్లు రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించింది.

అయితే ఈ గిఫ్ట్ తనంతట తానుగా జగన్ సర్కారు ఇవ్వలేదు. న్యాయమూర్తులకు కియా కార్లు కావాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఇటీవల జగన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ రిజిస్ట్రార్ జనరల్ లేఖను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం  20 కియా కార్ల కొనుగోళ్లకు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 20 కియా కార్ల కొనుగోళ్ల కోసం రూ. 6.30 కోట్ల విడుదల చేయాలని ఆర్ధిక శాఖకు న్యాయ శాఖ కార్యదర్శి సూచించారు.

ఒకప్పుడు ఏపీ హైకోర్టులంటే మండిపడిన సీఎం జగన్ ఇప్పుడు ఇలా కియా కార్లు సైతం అందించేందుకు అంగీకారం తెలపడం శుభపరిణామమే. అయితే ఇదంతా ఓ రొటీన్ ప్రక్రియ మాత్రమేనని.. దీన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని కొందరు అంటున్నారు. ఏదేమైనా ఏపీ హైకోర్టు న్యాయమూర్తులకు కొత్త కియా కార్లు ఇచ్చేందుకు జగన్ సర్కారు పచ్చజెండా ఉపడం మాత్రం ఆసక్తిదాయకమైన విషయమే.  




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: