సాగ‌ర్‌లో కేసీఆర్‌కు జ‌గ‌న్ మార్క్ షాక్‌... ఊహించ‌ని దెబ్బ‌తో మైండ్ బ్లాక్ ?

VUYYURU SUBHASH
తెలంగాణ‌లో నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక అన్ని ప్ర‌ధాన పార్టీల్లోనూ పొలిటిక‌ల్ కాక రేపుతోంది. ఇప్ప‌టికే ఆయా పార్టీలు నియోజ‌క‌వ‌ర్గంలో మకాం వేసి మ‌రీ ఎన్నిక‌ల ప్ర‌చారం చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ - కాంగ్రెస్ - బీజేపీ ఈ ఉప ఎన్నిక‌ను చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య మృతితో ఇక్క‌డ ఉప ఎన్నిక జ‌రుగుతోంది. ఈ స్థానం గెలుచుకోవ‌డం ఆ పార్టీకి చాలా కీల‌కం. ఇటు ద‌శాబ్దాలుగా ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని కంచుకోట‌గా మార్చుకున్న సీనియ‌ర్ నేత‌, మాజీ హోం మంత్రి కె. జానారెడ్డికి ఈ ఎన్నిక‌లే చివ‌రి ఎన్నిక‌లు కానున్నాయి. రాజ‌కీయ చ‌ర‌మాంకంలో ఉన్న ఆయ‌న‌కు ఈ ఉప ఎన్నిక అగ్నిప‌రీక్ష లాంటిదే. అందుకే ఆయ‌న కుమారుడు పోటీలో ఉన్నా కాద‌ని మ‌రీ ఆయ‌నే పోటీ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ ఉప ఎన్నిక‌ల వేళ మ‌రో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇక్క‌డ పోటీ చేయాల‌ని వైసీపీ నిర్ణ‌యం తీసుకుంది. వైసీపీ నుంచి ఓ అభ్య‌ర్థి నామినేష‌న్ వేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో ఏ ఎన్నిక జ‌రిగినా కూడా వైసీపీ వాళ్లు టీఆర్ఎస్‌కు అన‌ధి కారికంగా మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్టు ప్రచారం జ‌రిగింది. అయితే ఇప్పుడు మాత్రం ఇక్క‌డ వైసీపీ అభ్య‌ర్థి నామినేష‌న్ వేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇది కేసీఆర్‌కు మైన‌స్సే అవుతుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

ఇదిలా ఉంటే సాగ‌ర్లో అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు చెందిన 400 మంది నామినేష‌న్లు వేసేందుకు రెడీ అవుతున్నారు. కేసీఆర్ అమ‌రువీరుల కుటుంబాల‌కు ప్ర‌తి కుటుంబానికి రు. 10 ల‌క్ష‌ల ప్ర‌భుత్వ సాయం, ప్ర‌భుత్వ ఉద్యోగం, ఐదెక‌రాల ప్ర‌భుత్వ భూమి ఇస్తాన‌న్న హామీ ఇచ్చి.. దానిని నిల‌బెట్టుకోలేక‌పోయారన్న విమ‌ర్శ‌లు తీవ్రంగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో వారు భారీ ఎత్తున పోటీలో ఉంటే నిజామాబాద్ ఎంపీ సీటు ఫ‌లితం రిపీట్ అవుతుందా ? అన్న ఆందోళ‌న కూడా గులాబీ పార్టీలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: