తమిళనాడు లో ఆ పార్టీకే అనుకూలం...?
ముఖ్యంగా ఈ సర్వేలో ప్రజల నాడి ఎవరికి అనుకూలంగా ఉందో ఇందులో తెలుసుకోవడానికి ఈ సర్వేను చేశారు. ఇందులో కొన్ని అంశాలను ప్రామాణికంగా తీసుకుని సర్వేను మొదలుపెట్టారు. వాటిలో ముఖ్యంగా అవినీతి, యువత, ఎఐడీఎంకే పై బీజేపీ ప్రభావం, మహిళలు, నిరుద్యోగులు, వృద్దులు, అభివృధి మొదలైన అంశాలను తీసుకుని ప్రజల్ని ప్రశ్నించడం జరిగింది. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వ విధానాలను కూడా ఈ సర్వే పరిగణనలోకి తీసుకోవడం జరగింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ప్రభావితం చేసే అంశాలు డీఎంకే - స్టాలిన్ ఫ్యాక్టర్....మరియు ఎఐడీఎంకె కి -ఫలనిస్వామి ఫ్యాక్టర్ బీజేపీ కమల్ హాసన్ ఫ్యాక్టర్.. డీఎంకే మరియు కాంగ్రెస్ కూటమికి 44.5 శాతం, ఏఐడీఎంకే మరియు బీజేపీ కూటమికి 29.9 శాతం, కమల్ హాసన్ పార్టీకి 7.5 శాతం దినకరన్ పార్టీకి 6.9 శాతం మరియు ఇతరులకు 11.2 శాతం ఓట్లు వస్తాయని ఈ సర్వే తెలియచేసింది. ఇక పోతే ఎమ్మెల్యే సీటుల విషయానికి వస్తే
అత్యధికంగా డీఎంకే కూటమికి 167-170 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని తెలిపింది. ఏఐడీఎంకే కూటమికి 50 నుండి 53 ఎమ్మెల్యే సీట్లు. అలాగే కమల్ హాసన్ పార్టీకి 8 నుండి 9 సీట్లు మరియు దినకరన్ పార్టీకి 2 - 6 మరియు ఇతరులకు 4 - 8 సీట్లు వస్తాయని తన సర్వే ద్వారా తెలిపింది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఏఐడీఎంకే పరిపాలనా కాలంలో తమ స్వతహాగా పాలించకుండా, బీజేపీ ఎలా చెబితే అలా చేయడం వీరికి ప్రజల్లో ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. అంతే కాకుండా ఏఐడీఎంకే లో వర్గ పోరు కారణంగా పార్టీలో అనిశ్చితి నెలకొంది. జయలలిత లేని లేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఇది డీఎంకే పార్టీకి అనుకూలంగా మారె అవకాశం ఉందని గట్టిగ సమాచారం. అయితే బీజేపీ మాత్రం ఖచ్చితంగా తమిళనాడు లో ఏఐడీఎంకె కూటమి అధికారంలోకి వస్తుందని నొక్కి చెబుతున్నారు. బీజేపీ పై ప్రజలకు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత పెరుగుతూ ఉంది. ఇందుకు కారణాలు చాలా ఉన్నప్పటికీ, ముఖ్యంగా పెట్రోల్, గ్యాస్ మరియు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ విషయంలో వీరికి ప్రజలు తీర్పు ఈ విధంగా ఉంటుందో చూడాలి. మరి ఈ జరగనుంది చూడాలి.
మరి అసలు సామర్మ్లో ఏ విధంగా ప్రజలు తమ తీర్పును ఇవ్వనున్నారో తెలియనుంది.