ఏపీ స్పీకర్ చెప్పేసారు.. అలా చేసిన మొదటి వ్యక్తి ఆయనే అవుతారా..?
అధికార ప్రతిపక్ష పార్టీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది రాజకీయ నేతలు ప్రజలకు మద్దతు పలుకుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు ఉద్యమం కూడా చేపడుతున్నారు. ఇలా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో టిడిపి లో కీలక నేత అయిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
ఈ క్రమంలోనే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఏపీ రాజకీయాల్లో మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే కేవలం రాజీనామా చేయడమే కాదు ఆయన రాజీనామా పత్రాన్ని ఏపీ స్పీకర్ కు కూడా అందజేశారు. ఇటీవల టిడిపి నేత గంటా శ్రీనివాసరావు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం తో కలిసి సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఈ సమావేశం అనంతరం తనకు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రాన్ని గంటా శ్రీనివాసరావు ఇచ్చారని ఇక త్వరలోనే ఈ రాజీనామా ఆమోదించపోతున్నాను అంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పడం ఆసక్తికరంగా మారింది.