బండి నడుపుతూ ఫోన్ మాట్లాడుతున్నారా.. ఇక కోర్టుకు వెళ్లాల్సిందే..?

praveen
ఈ మధ్య కాలంలో రోడ్డు నిబంధనలు పాటించాలి అని అటు పోలీసు అధికారులు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే రోడ్డు నిబంధనలు పాటించక పోవడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరిగి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయాలను కూడా తెలుపుతూ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు అయినప్పటికీ వాహనదారులు తీరు లో మాత్రం మార్పు రావడం లేదు. అయితే ఎంత వినూత్నంగా వాహనదారులకు అవగాహన తెచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ ఎక్కడ ఉపయోగం లేకుండా పోయింది.



 ఈ క్రమంలోనే ఇక రోడ్డు ఈ పనులు పాటించని   వాహనదారులపై కొరడా జరిపించేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు రోడ్డు నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వాహనదారులకు భారీ జరిమానాలు విధించేందుకు సిద్ధమయ్యారు.  సాధారణంగా వాహనదారుడు బైక్ డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఇక ఫోన్ వచ్చింది అంటే చాలు పక్కకి బైక్ ఆపుకోకుండా అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఫోన్ మాట్లాడుతూ వెళ్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.



 ఇకనుంచి ఒకవేళ వాహనదారులు ఎవరైనా సరే బైక్ నడుపుతూ ఫోన్ మాట్లాడితే ఇక కోర్టు మెట్లు ఎక్కాల్సిందే అని సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు స్పష్టం చేశారు.  ఒకవేళ నేరం రుజువైతే భారీ జరిమానా తో పాటు మూడు నెలల జైలు శిక్ష తప్పదు అంటూ హెచ్చరించారు. అయితే ఇలా మొబైల్ మాట్లాడుతూ బైక్ నడిపితే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అది కోర్టుకు సమర్పిస్తాము అంటూ తెలిపారు. అయితే నగరంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రస్తుతం పోలీసు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఫోన్ మాట్లాడుతూ రోడ్డు నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వాహనదారులను గుర్తించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. అయితే ఇలాంటి సరికొత్త అమలులోకి తీసుకు రావడం వల్ల ఇక రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి అని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: