దుబాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఒకప్పుడు ఎడారి ప్రాంతం లాగా వుండే దుబాయ్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు పర్యాటక స్థలంగా మారింది. ఎన్నో అద్భుతమైన కట్టడాలతో ప్రపంచ పర్యాటకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది దుబాయ్. ఇక దుబాయ్ అంటే కేవలం కట్టడాలకు మంచి మంచి ప్రదేశాలకు ప్రసిద్ధి మాత్రమే కాదండోయ్. దుబాయ్ అంటే మంచి రుచికరమైన ఫుడ్ కి కూడా ప్రసిద్ధి. ముఖ్యంగా అక్కడ దొరికే ఒంటె మాంసం కోసం ప్రపంచ దేశాల పర్యాటకులు తరలి వస్తుంటారు. అంత రుచికరమైన ఆహారం అక్కడ దొరుకుతుంది.ముఖ్యంగా అక్కడి మాంసాహారం అంటే చాలా పర్యాటకులకు చాలా ఇష్టం. ఇక దుబాయ్ లో దొరకని వంటకం అంటూ ఏమి ఉండదు. ఇక దుబాయ్ వాళ్ళు ఎంతగానో ఇష్టపడే వంటకం కూడా ఒకటి వుంది. ఆ వంటకం కోసం వారు వేరే దేశానికి కూడా వెళ్తుంటారు. ఆ దేశం ఏదో కాదు. పాకిస్తాన్. పాకిస్తాన్ లో దొరికే హౌబోరా అనే పక్షి మాంసం కోసం డాన్ని వేటాడడానికి దుబాయ్ రాజులు పాకిస్తాన్ కి వెళ్తారట. ఆ పక్షి మాంసం ఎంతో రుచికరంగా ఉంటుందట.
ఆ పక్షులు అరేబియా సముద్రం నుంచి సీతా కాలంలో పాకిస్తాన్ కి వలస వస్తుంటాయట. ఇక వాటిని వేటడటం కోసం దుబాయ్ రాజులు పాకిస్తాన్ కి రావడం కోసం పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చిందట. దాని కోసం 1989 లోనే చట్టం కూడా చేసిందట పాకిస్తాన్ ప్రభుత్వం. అయితే 50 వేల నుంచి లక్ష దాకా వలస వచ్చే ఆ పక్షులు ఇప్పుడు క్రమంగా తగ్గిపోవడంతో పాకిస్తాన్ లో పర్యాటాక నిపుణులు దుబాయ్ రాజులకి పాకిస్తాన్ కి రానివ్వకండి అని పాకిస్తాన్ ప్రభుత్వంని హెచ్చరిస్తూ ఆందోళన చేస్తున్నారట. మరి దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...