ప్లాన్ ప్రకారం మొత్తం దోచేసిన దొంగ.. ఆనందంలో హార్ట్ ఎటాక్.. చివరికి..?
పక్కా ప్లాన్ ప్రకారం దొంగతనాలకు పాల్పడుతూ ఇక పోలీసులకు ఎలాంటి ఆచూకీ లభించకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే దొంగ ఎంతో కష్టపడి ప్లాన్ వేసుకుని ఇక అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత అనుకున్నట్టుగానే భారీగా నగదు నగలు దొరికాయి అంటే అతని ఆనందానికి అవధులు లేకుండా పోతాయ్. అందిన కాడికి దోచుకుని అక్కడి నుంచి పరారవుతూ ఉంటాడు దొంగ. ఆ తర్వాత దొంగలించిన సొమ్ముతో జల్సాలు చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఒక దొంగకు మాత్రం అంత అదృష్టం లేకుండా పోయింది. దొంగతనానికి వెళ్లి ప్లాన్ ప్రకారమే అంతా దోచుకున్నాడు కానీ అంతలో ఆనందం లో అతనికి హార్ట్ ఎటాక్ వచ్చింది.
ఇంకేముంది ఎంతో కష్టపడి దోచుకున్న సొమ్ము అంతా చివరికి ఆసుపత్రి లో చికిత్స తీసుకోవడానికి సరిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్ లో వెలుగులోకి వచ్చింది. కొత్వాలి ప్రజా సేవా కేంద్రంలో ఫిబ్రవరి 7వ తేదీన ఇద్దరు దొంగలు చొరబడి ఇక ఏడు లక్షల రూపాయల నగదును దోచుకున్నారు. అయితే ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి విచారించగా ఇక దొంగలించిన డబ్బు మొత్తాన్ని ఆస్పత్రి ఖర్చు పెట్టాము అంటూ చెప్పుకొచ్చారు సదరు దొంగలు.