సారంగ దరియా పేరడీగా కొవిడ్ టీకా పాట.. ఫుల్ వైరల్..!

Chakravarthi Kalyan
సారంగ దరియా సాంగ్.. ఇప్పుడు నెట్‌లో ఇదో ట్రెండ్‌ సెట్టింగ్ సాంగ్.. సాయి పల్లవి అంటేనే కుర్రకారులో ఓ క్రేజ్.. అందానికి అందం.. నటన, డ్యాన్స్ అన్నీ కలగలపిన సాంగ్.. అందుకే నెట్‌ను ఊపేస్తోంది. అతి తక్కువ కాలంలో 100 మిలియన్ల వ్యూస్ సాధించిన దక్షిణాది పాటగా రికార్డు సాధించింది. ఇప్పుడు ఈ పాటకు పేరడీగా కరోనా టీకా పాట వచ్చింది. ఫుల్ వైరల్ అవుతోంది.

మీ కోసం ఇదిగో సారంగదరియా పేరడీ సాంగ్.


వారి కుడిభుజం మీద  టీకా
మీరు వేసుకొనుటకిది మోకా

వ్యాథి రమ్మన్న రాదురా కాకా
దాని పేరే కోవిడ్ టీకా

వారి  ఎడమ భుజం మీద  టీకా
జర  వేసుకొనుడి ఇది  మోకా

వ్యాథి  రమ్మన్న  రాదురా కాకా
దాని పేరే  కోవిడ్  టీకా

పల్లవి:

ముక్కుకి కాటన్ మాస్కుల్
లేకున్నా బతుకులు ముస్కిల్

చేతికి ప్లాస్టిక్ గ్లౌజుల్
లేకున్నా  ఉంటయ్ రిస్కుల్

అడుగడుగున  కోవిడ్  ఆంక్షల్
పాటిస్తే  ఉండవు  చావుల్

ఒంట్లో  మజిల్సు నొప్పుల్
లేకున్నా  జ్వరము నిప్పుల్

దివి కంటితో  దివి కంటితో
దివి కంటితో చూడగా  తప్పుల్

తుర్రున పోతయిరా ముప్పుల్

టీకా... టీకా...టీకా

ఇది  కరోనా కట్టడి   మోకా

వ్యాథి రమ్మన్న రాదురా కాకా
దాని పేరే కోవిడ్  టీకా

వారి కుడిభుజం మీద  టీకా
మీరు వేసుకొనుటకిది మోకా

వ్యాథి రమ్మన్న రాదురా కాకా
  దాని పేరే కోవిడ్ టీకా

వారి  ఎడమ భుజం మీద  టీకా
జర   వేసుకొనుడి ఇది  మోకా

వ్యాథి  రమ్మన్న  రాదురా కాకా
దాని పేరే  కోవిడ్  టీకా

మర్లపడితే  రోగం  తిరుగది
గొలుసును  తెంచిన విరుగది

అరికట్టబోతే అది ఆగది

వినురా వినురా వినురా

అది ప్రాణాల గుత్తిది   కదరా

వ్యాథి రమ్మంటె రాదురా కాకా.
దాని పేరే  కొవిడ్ టీకా

చరణం:

వారి ఇంట్లో  ఎన్నెల  కురియా
వారి కంట్లో పాపలు మెరియా

వ్యాథి  రమ్మంటె రాదురా కాకా
దాని పేరే కోవిడ్  టీకా

వారి పసిడి  బుడతలే మెరియా
నడయాడును ఆరోగ్య  దునియా

అది రమ్మంటె రాదురా కాకా
దాని పేరే  కోవిడ్ టీకా

వారి కుడిభుజం మీద  టీకా
మీరు వేసుకొనుటకిది మోకా

వ్యాథి రమ్మన్న రాదురా కాకా
దాని పేరే కోవిడ్ టీకా

వారి  ఎడమ భుజం మీద  టీకా
మీరు  వేసుకొనుటకిది మోకా

వ్యాథి  రమ్మన్న  రాదురా కాకా
దాని పేరే  కోవిడ్  టీకా


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: