నైట్ కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం.. నిరసనగా మద్యం వ్యాపారులు ఏం చేశారో తెలుసా..?
ఇక వైరస్ ను కంట్రోల్ చేసేందుకు అటు మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలోనే శ్రమిస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలో ఇప్పటికే ఈ వైరస్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక వైరస్ ప్రభావం మరింత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించేందుకు కూడా వెనకాడబోమని అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం మరింత ఆసక్తికరం గా మారిపోయింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించడంతో కొంతమంది వ్యాపారులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 15 వరకు రాత్రి కర్ఫ్యూ విధించింది. అయితే దీంతో జిల్లావ్యాప్తంగా హోటల్ యజమానుల సంఘం మద్యం విక్రయాలను నిలిపివేస్తూ నిరసన తెలిపారు. గతంలోనే లాక్డౌన్ సమయంలో భారీగా నష్టపోయామని ఇక ఇప్పుడూ నైట్ కర్ప్యూ కారణంగా మరింత నష్టపోయే అవకాశం ఉందని.. ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ ఎత్తివేసేంతవరకు కూడా మద్యం విక్రయాలు జరగబోవు అంటూ తెలిపారు. ప్రభుత్వం దిగిరాక పోతే మిగతా జిల్లాల్లో కూడా మద్యం విక్రయాలు నిలిపివేస్తామని అంటూ స్పష్టం చేశారు వ్యాపారులు.