మందుబాబుల అరికాళ్ళకు చిప్.. తెర మీదికి కొత్త టెక్నాలజీ..?
అయితే ఇటీవలే బ్రిటన్లో మందుబాబులు రోజురోజుకు ఎక్కువైపోతున్నారు. మద్యానికి బానిసగా మారుతున్న అక్కడి ప్రజలు ఇక ఎన్నో దారుణ ఘటన లకు అసలు కారణం గా మారిపోతున్నారు. ఈ క్రమంలోనే ఇక అక్కడ ప్రజలందరూ మద్యానికి బానిసగా మారకుండా ఉండేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మందుబాబుల ఆగడాలను చెక్ పెట్టే విధంగా ఇక మందుబాబులు ఎంత మద్యం తాగారు అన్న విషయాన్ని ఆటోమేటిక్ గా కనిపెట్టె విధంగా ఒక సరికొత్త టెక్నాలజీని కనుగొంది ప్రభుత్వం. సాధారణంగా మనం సినిమాలలో ఎవరి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే శరీరంలో చిప్ పెట్టడం లాంటివి చూస్తూ ఉంటాం
ఇక్కడ బ్రిటన్ ప్రభుత్వం మరికొన్ని రోజుల్లో ఇదే చేయబోతుంది. మందుబాబులు ఎంత మొత్తంలో మద్యం తాగారు అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఇక అక్కడి మందుబాబుల అరికాళ్లకు చిప్ పెట్టేందుకు సిద్ధమైంది. ఇక ఈ చిప్ ద్వారా మందుబాబులు ఎక్కడికి వెళ్తున్నారు అన్న విషయాన్ని కూడా తెలుసుకునేందుకు వీలు ఉంటుంది అంతే కాకుండా ప్రతి 30 నిమిషాలకు ఒకసారి వారి శరీరం నుంచి వచ్చిన చెమటలో ఆల్కహాల్ ను శాతాన్ని బట్టి వారు ఎంత మొత్తంలో ఆల్కహాల్ తీసుకున్నారు అన్న విషయాన్ని ఆటోమేటిక్గా అధికారులకు తెలియజేస్తూ ఉంటుంది. అయితే ఈ సరికొత్త టెక్నాలజీ ద్వారా అటు బ్రిటన్లో మందుబాబులు ఆగడాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.