యనమల...నీ మాయాజాలం బయటపెట్టు...
యనమల రామకృష్ణుడు....టీడీపీ సీనియర్ నేత....అంతకంటే ముఖ్యంగా ఎన్టీఆర్‌ని సీఎం పీఠం నుంచి గద్దె దింపేటప్పుడు స్పీకర్‌గా ముఖ్య పాత్ర పోషించారు. అప్పుడు యనమల చేసిన కార్యక్రమాలు ఏంటో అందరికీ తెలిసిందే. ఇక అది చరిత్ర కాబట్టి ఆ విషయాన్ని వదిలేస్తే, కొత్తగా ఏర్పడిన నవ్యాంధ్రకు తొలి ఆర్ధికశాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ఆర్ధిక మంత్రి అంటే ఏ స్థాయిలో ప్రజలకు సేవ చేయాలో తెలిసిందే. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఆర్ధిక మంత్రి నడవాల్సి ఉంటుంది.
కానీ టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు యనమల, చంద్రబాబు బాటలో నడిచారు. సొంత పార్టీ నేతల, కార్యకర్తల అవసరాలకు తగ్గట్టుగా నడుచుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, నాయకుల చిల్లర ఖర్చులు సైతం రాష్ట్ర ఖజానా నుంచే ఖర్చు పెట్టారు. ఇక ఆ అయిదేళ్లలో ఎంత అప్పు చేశారో కూడా అందరికీ తెలిసిందే. ఇలా యనమల ఆర్ధిక మంత్రిగా బాగానే మాయాజాలం చేసి, ప్రజల సొమ్ముని విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు.
ఇక టీడీపీ పాలనతో విసిగిపోయిన జనం, జగన్‌ని భారీ మెజారిటీతో గెలిపించారు. జగన్ సీఎం అయ్యి ప్రజలకు అనుగుణంగా పాలన చేస్తున్నారు. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా సరే జగన్, ప్రజలని వదిలిపెట్టకుండా పాలన ముందుకు నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రజల కోసం కొంతమేర అప్పు కూడా చేశారు.
ఇప్పుడు ఈ విషయంపైనే యనమల రచ్చ చేస్తున్నారు. అప్పులు తప్ప.. అభివృద్ధి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని మార్చారని, జగన్ రెడ్డి అనాలోచిత పాలనలో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. ఆదాయం, అప్పుల ద్వారా వచ్చిన సొమ్ము ఏమవుతోందని ప్రశ్నించారు. అలాగే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే గతంలో టీడీపీ ప్రభుత్వం ఎంత అప్పులు చేసిందో తెలిసిందే. ఆ డబ్బులు ఏం చేశారో ఎవరికీ తెలియదు. అప్పుడు ఒక శ్వేత పత్రం కూడా విడుదల చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి గతంలో యనమల చేసిన మాయాజాలం బయటపెడితే బాగుంటుందని వైసీపీ నాయకులు అంటున్నారు.