భార్యను కొండపైకి షికారు తీసుకెళ్లిన భర్త.. చివరికి ఏం చేసాడో తెలుసా..?

praveen
ఈ మధ్యకాలంలో భార్య భర్తల బంధం లో అన్యోన్యత కాదు మనస్పర్థలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చిన్న చిన్న మనస్పర్ధలకే భార్య భర్తలు విడిపోతున్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి. అంతేకాకుండా వేదమంత్రాల సాక్షిగా కడవరకు తోడు ఉంటామని ప్రమాణం చేసిన వారే చివరికి కట్టుకున్న వారిని దారుణంగా కడతేర్చిన ఘటన లు కూడా కోకొల్లలు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉండేవి.  పెళ్లయిన కొన్నాళ్ళ వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత మాత్రం..  ఏదో ఒక కారణంతో భర్త భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. అయితే ఇటీవలే భర్త భార్యను షికారుకు తీసుకెళ్లాలి అనుకున్నాడు.



 ఈ క్రమంలోనే ఈ షికారుకి క వెళ్దాం రా అనగానే ఇక భర్త పై ఎంతో ప్రేమ ఉన్న భార్య అడ్డుచెప్పకుండా  షికారుకి వెళ్లేందుకు సిద్ధం అయింది ఈ క్రమంలోనే సమీపంలో ఉన్న ఒక ఎత్తైన కొండ పైకి తీసుకెళ్ళాడు అక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ ఇక అక్కడే అసలు విషయం బయటపడింది. భర్త ఉద్దేశపూర్వకంగానే అక్కడికి తీసుకెళ్లాడని అతడు భర్త కాదు నరరూప రాక్షసుడు అని తెలిసింది కొండ పైకి తీసుకెళ్ళిన కట్టుకున్న భర్తే భార్యను దారుణంగా అతికిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కుమిలి గ్రామంలో చోటు చేసుకుంది.  గ్రామానికి ఆనుకొని ఉన్న ఎత్తైన కొండ పైకి భార్య భర్తలు ఇద్దరు వెళ్లారు. కొండపైకి చేరుకున్న తర్వాత భార్య గొంతు నులిమి కిందకి నెట్టి దారుణంగా హత్యచేశాడు భర్త శ్రీను. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు



అయితే సదరు మహిళ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అతని ఫోన్ సిగ్నల్స్ ను ట్రాక్ చేశారు పోలీసులు.  రెండవ తేదీన భర్త కొండ పైకి వెళ్ళినట్లు గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకొని విచారించారు దీంతో చివరికి అతను భార్యను హత్య చేసినట్లుగా నేరం అంగీకరించాడు. అయితే ఇక భర్త ఎందుకు భార్యను హత్య చేయాల్సి వచ్చింది అని వివిధ కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: