జగన్ పై రఘురామ కు అంత కోపం ఎందుకు?
బీజేపీ నాయకులు కూడా ప్రచారం చేస్తున్నారు. తిరుపతి స్థానాన్ని నిలబెట్టుకునేందుకు వైసీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో కొత్త కొత్త వ్యూహాలను రచిస్తూ ప్రజలను ఆకర్షించడానికి ప్రయతిస్తున్నారు. అయితే, తిరుపతిలో జరిగే ఎన్నికల్లో ఎలాగైనా సత్తాను చాటాలని వైసీపీ కూడా ఎత్తుకు పైఎత్తులు వేస్తూనే ఉంది.తిరుపతిలో ఓ ఆశ్రమానికి సంబంధించి రూ.30 కోట్ల స్కాంతో పాటు రిటైర్ అర్చకుడు రమణ దీక్షితులను మళ్లీ ప్రధాన అర్చకుడిగా నియమించడం జరిగింది.
ఇకపోతే ఆయన జగన్ జగన్ను విష్ణుమూర్తితో పోల్చడం వంటి అంశాలు తిరుపతి ఉపఎన్నికపై ప్రభావం చూపుతున్నాయి. వివేకానంద రెడ్డి హత్య ఎన్నికల్లో అస్త్రంగా వాడుతున్నారు.సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరారు. అయితే ఈ పిటిషన్ సరిగాలేదని కోర్టు రిటర్న్ చేసింది. ఇక జగన్ బెయిల్ రద్దు అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపింది. అంతేకాదు.. రఘు రామకు జగన్ పై అంత కోపం ఎందుకు? బెయిల్ ను రద్దు చేయించేంత ఏం జరిగింది? ఇలాంటి పలు ప్రశ్నలు జనాలకు వస్తున్నాయి. ఇక చివరికి వీరిద్దరి మధ్య రగడ ఎంతవరకు వెళుతుందో చూడాలి..