తెలుగుదేశం పార్టీకి సంబంధించి బాపట్లకు మాజీ
ఎమ్మెల్యే ని వైసీపీలో చేర్చుకున్నారు. అది స్వయంగా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్
రెడ్డి సమక్షంలోనే చేరడమన్నది మరో విశేషం. వాస్తవానికి చెప్పాలంటే ఎమ్మెల్యేల్ని కూడా తీసుకోలేదు. వాళ్ళ కొడుకుల్ని అటు కరణం బలరాం, గన్నవరం
ఎమ్మెల్యే వంశీ ఇటువంటి వాళ్లకి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళ కొడుకులకు కండువా కప్పుతారు. అయితే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేను చేర్చుకోవడంపై చర్చలు మొదలయ్యాయి. ఇక్కడ వినపడుతున్నటువంటి మాట ఏమిటంటే..?? నెక్స్ట్ కాన్సెన్ట్రేషన్ సెకండ్ క్యాడర్ మీద ఉండాలి అన్నటువంటి ఆలోచన అధికార
వైసీపీ చేస్తోంది. ఎందుకంటే తెలంగాణలో ఏ విధంగా
కేసీఆర్ రాజకీయం చేశారో అదే ఫార్ములాను ఇక్కడ కూడా వాడుతున్నట్లుగా స్పష్టం అవుతూ ఉంది.
తెలంగాణలో
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తర్వాత పెద్ద పెద్ద నాయకుల మీదనే చంద్రబాబు నాయుడు కాన్సెన్ట్రేట్ చేసారు. ముఖ్యంగా ఆ పార్టీలో ఉన్న సెకండ్ క్యాడర్ నాయకులను అస్సలు పట్టించుకోలేదు. వాస్తవానికి సెకండ్ క్యాడర్ నాయకులే తెలుగు దేశం పార్టీకి వెన్నెముక అని బాబు మరిచిపోతున్నారు. ఆ తర్వాత విసుగు చెందిన నాయకులు మెల్ల మెల్లగా
పార్టీ మారారు. అయితే
టీడీపీ ఏమనుకుందంటే నాయకులు పోయారు కానీ క్యాడర్ మా దగ్గరే ఉంది కదా అని భావించారు .కానీ ఆ క్యాడర్ కూడా కొంత తెరాసకి కొంత
కాంగ్రెస్ కి వెళ్లిపోయారు .ఈ ఇరు పార్టీల్లో స్థానం దొరకని వాళ్ళు
బీజేపీ సైడు వెళ్లిపోయారు. దీనితోనే వరుసగా అంటే తెలుగు దేశం పార్టీలు చివరికి అటు నాయకులు ఇటు క్యాడర్ రెండూ దూరమయ్యాయి. దీనితో ఇప్పుడు ఎమ్మెల్యేలను తీసుకొస్తే వారేమో రాజీనామాలు చేస్తున్నారు.
జగన్ మోహన్రెడ్డి విలువలు..భాద్యతలు..వంటి పదాలలో భాగంగా చెప్పుకొచ్చ్చారు కదా. అంటే
రాజీనామా చేసి గెలవాలన్న వాదన..ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ విలువలను కాపాడుకున్నారు.
అప్పట్లో
కాంగ్రెస్ మరియు...తెలుగు దేశం
పార్టీ నుండి
పార్టీ లోకి వస్తామన్న 18 మందిని పదవులకు రాజీనామా చేయించి మరీ పోటీలో నిలబెట్టారు. ఆ తర్వాత
వైసిపి పవర్ లోకి వచ్చాక ఓడిపోయిన వారికి కూడా పదవులు ఇచ్చిన విషయం తెలిసిందే. అదే విధంగా అప్పట్లో నంద్యాలలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా శిల్ప చక్రపాణి విషయంలోనూ అదే కదా జరిగింది. చివరకి వాళ్ళ బ్రదర్ ని ఎమ్మెల్సీగా
రాజీనామా చేయించి మరి ఇక్కడ తీసుకోవడం జరిగింది. అంటే ఇవన్నీ గమనిస్తే అవి వాళ్ళు చెప్పిన విలువలు, విశ్వనీయతను కాపాడాయి. అయితే ఎన్నికల్లో ఏం చెప్పారు 23 మంది ఎమ్మెల్యేల్ని దుర్మార్గంగా తీసుకెళ్లినటువంటి చంద్రబాబు నాయుడు లాంటి విశ్వసనీయత లేనటువంటి పనులు మా
పార్టీ చేయదని చెప్పారు. ..నా పార్టీలోకి ఎవరు రావాలి అన్నా ముందు వారి పదవులకు
రాజీనామా చేసి, ఎన్నికల్లో నిలబడి గెలిచి చేరాలి అన్నారు.
రావడానికి కొందరు రెడీగా ఉన్నప్పటికీ..ఈ
రాజీనామా చేసి మళ్ళీ గెలవాలి అన్న కాన్సెప్ట్ కి భయపడి ఆలోచిస్తున్నారు. ఆ దిశగా అటు బలరాం కానీ, ఇటు వంశి కానీ , గిరి కానీ ఎవరు దైర్యం చేయలేకపోతున్నారన్నది ఒక వర్గం వాదన. దాంతో ఒకవేళ ఇప్పుడు కనుక ఆపేస్తే ఇబ్బంది అనుకున్నారో ఏమో గాని వాళ్ళని తటస్థులుగా ఉంచేశారు. ఇక్కడే
పార్టీ విశ్వసనీయత అన్నది కొంత పోయిందన్న
భావన వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీపై గ్రౌండ్ లెవల్లో ఉన్న ఫీలింగ్ పోయింది .ఇప్పుడు ప్రస్తుత
సర్వే ప్రకారం పాత ఎమ్మెల్యేలతో ఎక్కువగా ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది.. కాబట్టి కొత్త వారిని తీసుకోవడం వల్ల..గెలవడం మాట అటుంచితే..వ్యతిరేకత పోతుంది అన్నది
వైసీపీ ప్లాన్ అన్నది కనబడుతోంది. మరి ఇది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.