కొత్త పార్టీ పెట్టడానికి కారణం అదే.. వైయస్ షర్మిల కీలక వ్యాఖ్యలు..?

praveen
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకు వస్తానని తాను తెలంగాణ కోడలినని అందుకే తెలంగాణలో ప్రజలు కష్టపడుతుంటే చూడలేక పోతున్నా అని ఒక కొత్త పార్టీ పెట్టి తెలంగాణ ప్రజలందరికీ కూడా మరోసారి రాజన్న పాలన అందిస్తారను అంటూ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు.  అయితే అటు తెలంగాణలోని అన్ని పార్టీల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ వైయస్ షర్మిల మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. కీలక వ్యక్తుల తో చర్చలు జరుపుతూ పార్టీ పెట్టే దిశగా ముందడుగు వేస్తూనే ఉన్నారు  షర్మిల.


 ఇకపోతే నిన్న ముందుగా ప్రకటించిన తెలంగాణ గుమ్మం  ఖమ్మం వేదికగా పెవిలియన్ గ్రౌండ్లో భారీ సంకల్ప సభ నిర్వహించారు వైయస్ షర్మిల. ఇక ఈ సంకల్ప సభకు భారీగా అభిమానులు తరలి వచ్చారు. ఈ సభ లో భాగంగా ప్రసంగించిన వైయస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జులై 8 వ తేదీన తాను పార్టీ ప్రకటించ పోతున్నాను అంటూ స్పష్టం చేశారు.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున తన పార్టీని ప్రకటించడంతో పాటు పార్టీ అజెండా  కూడా ప్రకటిస్తానని తెలిపారు.  తను బరాబర్ తెలంగాణ బిడ్డ నేనని తెలంగాణలో తప్పక రాజకీయాల్లో రాణిస్తా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


 అయితే తాను పార్టీ పెట్టడానికి అసలు కారణం ఏంటి అనే విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు వైయస్ షర్మిల. పాలకవర్గాన్ని ప్రశ్నించడానికి నిలదీయడానికి కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యాను అంటూ వైఎస్ షర్మిల చెప్పుకొచ్చారు. కెసిఆర్ కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైంది అంటూ ప్రశ్నించారు వైయస్ షర్మిల. వైఎస్సార్ హయాంలో జంబో డీఎస్సీ ప్రకటించి ఎంతో మందికి ఉద్యోగాలు ఇస్తే ఇంటికొక ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ హామీ ఎటు పోయింది అని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారని కానీ అది కూడా ఇవ్వడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: