మళ్ళీ అదే పరిస్థితి.. అంత్యక్రియలకు కనీసం స్థలం కూడా దొరకడం లేదు..?
గత ఏడాది శరవేగంగా విజృంభించిన ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ మరింత వేగంగా పాకిపోతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా పాకిపోయి అందరిని వణికిస్తుంది ఈ మహమ్మారి వైరస్. గత ఏడాది ఇదే సమయంలో వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోవడంతో ఇక ఆసుపత్రులలో కనీసం బెడ్లు కూడా సరిపోని పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా వైరస్ మృతుల సంఖ్య భారీగా ఉండడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు కనీసం స్థలం కూడా దొరకని దుస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి ఇలాంటి పరిస్థితులే వస్తున్నట్లు తెలుస్తోంది.
వైరస్ కేసులు అంతకంతకూ పెరిగి పోవడమే కాదు అటు మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగి పోతుంది. దీంతో అంత్యక్రియలు చేసేందుకు స్థలం కూడా కరువైన పరిస్థితి ఏర్పడుతుందని తెలుస్తుంది. యూపీలోని లక్నో మున్సిపాలిటీకి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అంత్యక్రియల కోసం ప్రత్యేక ప్లాట్ఫామ్ లు తయారు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే 20 ప్లాట్ఫామ్లు సిద్ధం చేసినట్లు సమాచారం. ఇవి కూడా సరిపోకపోవడంతో మరో 50 ప్లాట్ఫామ్లు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో వైరస్ మృతులకు అంత్యక్రియలు జరిపేందుకు ఎవరు ముందుకు రాని దుస్థితి కూడా ఏర్పడుతున్న ట్లు తెలుస్తోంది. దీంతో రానున్న రోజుల్లో ఇంకెంత దారుణ ఘటనలు చోటు చేసుకుంటాయో అని అందరు ఆందోళన చెందుతున్నారు.