ఏం నాయనా.. వేడి వేడి వడ కావాలా?

Satvika
ఏపిలో ఎన్నికల టెన్షన్ ఇంకా కొనసాగుతుంది. తిరుపతి ఉపఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో  నేతలు కార్యకర్తలు ప్రచారంలో జోరును పెంచారు. టీడీపీ నేతల పర్యటన మాత్రం మాములుగా లేదని చెప్పాలి.ప్రధాన పార్టీలు అన్నీ దూకుడు పెంచాయి. మాటల తూటాలు పేలుస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వైరెటీ ప్రచారాలతో దూసుకుపోతున్నారు. పాదయాత్ర నిర్వహిస్తున్న సమయంలో రోడ్డు పక్కన కనిపించిన షాపుల దగ్గర ఆగుతూ.. అక్కడ పనివాళ్ల కష్ట సుఖాలపై ఆరా తీస్తున్నారు.


అంతేకాదు ఓ టిఫిన్ షాపుకు వెళ్లిన ఆయన వేడి వేడి వడలు వేసి జనాలను ఆకట్టుకున్నారు..మాములుగా లోకేశ్ పర్యటనలు అంటే కేవలం బహిరంగ సభలు.. రోడ్ షోలకే పరిమితం అవుతూ ఉంటాయి. కానీ ఈ సారి పనబాక లక్ష్మి తరుపున ఆయన పలు గ్రామాల్లో పాదయాత్ర చేస్తున్నారు.రొోడ్డుపై కనిపించిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. అలా రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఓ చాయ్ వాలా దగ్గర ఆగి.. టీ తాగి కాసేపు ముచ్చట్లు పెట్టారు. చాయ్ సూపర్ తమ్ముడు అంటూ కితాబ్ ఇచ్చారు. స్టార్ హోటల్ లో కూడా టేస్ట్ రాదంటూ టీనీ తాగారు.


గత ప్రచారంలో ఎప్పుడు టీ తాగని లోకేశ్ బాబు తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో ఎక్కడ చాయ్ బడ్డీ కనిపించినా.. అక్కడకు వెళ్లి వారితో మాట్లాడి అందరి కష్టాలు వింటున్నాం.. టీడీపీ అధికారంలోకి వచ్చాక మీ అందరి కష్టాలు తీరుతాయని భరోసా ఇస్తున్నారంటూ చెబుతున్నారు. మరోవైపు లోకేష్ పెడుతున్న ఈ చాయ్ పే చర్చకు మంచి స్పందనే వస్తోందని  తెలుగు తమ్ముళ్లు అభిప్రాయ పడుతున్నారు. కరోనా భయం లేకుండా జనాల్లోకి దూసుకుపోతున్నారు. పెద్ద వాళ్ళతో పోలిస్తే చిన్న వాళ్ళను ఎక్కువగా లాలిస్తూ, ముచ్చట్లు పెడుతున్నారు.లోకేష్ తో షేక్ హ్యాండ్ లకు.. సెల్ఫీలకు తిరుపతి వాసులు సైతం భారీగానే పోటీ పడుతున్నారు.. మరి ఎన్నికల్లో గెలుపు ఎవరికీ సొంతం అవుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: