పిల్లలతో దొంగతనాలు.. కొత్త గ్యాంగ్ వచ్చేసింది..?
ఇటీవలే పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తరకం చోరీ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడి వరకు పెద్దవాళ్ళు చోరీలకు వచ్చి ఇళ్లలో దొంగతనాలకు పాల్పడటం లాంటివి చూశాము కానీ ఇక్కడ మాత్రం ఏకంగా పిల్లలతో చోరీలు చేయించడం కలకలం సృష్టించింది. ఏలూరు త్రీ టౌన్ పరిధిలో ఇటీవల తరచూ దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఎక్కువగా ఫిర్యాదులు అందడంతో దొంగతనాలు ఎలా జరుగుతున్నాయి అనేదానిపై సీరియస్ గా తీసుకుని నిఘా పెట్టారు. అయితే పోలీసులు విచారణ కొనసాగిస్తున్న సమయంలో బయటపడినా నిజాలతో ఒక్కసారిగా షాకయ్యారు. స్థానిక లంబాడి పేట కు చెందిన చాందిని అనే మహిళ ఈ నేరాలకు పాల్పడుతునట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
అయితే స్వయంగా సదరు మహిళ దొంగతనాలకు పాల్పడకుండా చిన్న పిల్లలతో దొంగతనాలకు పాల్పడుతున్న విషయం కూడా పోలీసుల విచారణలో తేలింది. తన బంధువైన 16 ఏళ్ళ బాలుడిని దెందులూరు మండలానికి చెందిన 14ఏళ్ల బాలుడిని దొంగతనాల కోసం ఎంపిక చేసి దోచేసిన బంగారు వెండి ఆభరణాలను షాపులో అమ్మేసింది. కొంత బంగారాన్ని తాకట్టు పెట్టి సొమ్ము చేసుకుంది. ఇలా ఇద్దరు బాలుర తో దొంగతనాలు చేయడం మొదలు పెట్టడంతో ఇక ఫిర్యాదులు అందుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి ఇద్దరు పిల్లలను జువైనల్ హోంకు తరలించారు.