బీజేపీ కొత్త అస్త్రం.. వైసీపీ గరం గరం..?

praveen
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మొత్తం తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి.అయితే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సమీపిస్తున్నకొద్దీ అన్ని పార్టీలు కూడా సరికొత్త అస్త్రలను తెర మీదికి వచ్చి విమర్శలు గుప్పించడం మొదలుపెడుతున్నాయి ముఖ్యంగా బిజెపి వైసిపి పార్టీలు తిరుపతి ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే ఇప్పటికే జరిగిన మున్సిపల్ పంచాయతీ ఎన్నికలలో కొన్ని ప్రాంతాలలో విజయం సాధించి అధికారం వైసిపి పార్టీకి షాకిచ్చింది బీజేపీ జనసేన కూటమి. ఇక ఇప్పుడు ఏకంగా పార్లమెంటు ఉప ఎన్నికల్లో విజయం సాధించి అధికార పార్టీకి ఊహించని షాక్ ఇవ్వాలని అనుకుంటుంది. ఈ క్రమంలోనే ఇక ఎన్నో అస్త్రాలని ఉపయోగిస్తుంది బీజేపీ పార్టీ.


 ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో బరిలోకి దింపిన అభ్యర్థిని హిందువు కాదు అని ప్రొజెక్ట్ చేసే పనిలో పడింది బీజేపీ. ఇప్పటికే వైసీపీ బీజేపీ మధ్య ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విమర్శలు ప్రతివిమర్శలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే గతంలో తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిజెపి నేత సునీల్ దియోధర్ మతం మార్చిన వ్యక్తి ని తీసుకొచ్చి హిందూ అంటూ వైసిపి ప్రజలందరికీ మోసం చేస్తోంది అంటూ వ్యాఖ్యానించారు.  ఇలాంటి దొంగ మాటలు చెప్పవద్దు అని ఇంతకుముందు వై.వి.సుబ్బారెడ్డి విషయంలో కూడా ఇలాగే మాట్లాడారని కానీ ప్రస్తుత అధ్యక్షుడు మాత్రం పక్కా హిందూ అంటూ వైసీపీ చెప్పుకొచ్చింది.




 ఇటీవలే మరో సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయింది బిజెపి. ఏకంగా వైసీపీ తిరుపతి ఉప ఎన్నికల బరిలోకి దింపిన అభ్యర్థి క్రిస్టియన్ అంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోటోలపై అటు వైసిపి మాత్రం సీరియస్ అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఎంతోమంది హిందూ ప్రజాప్రతినిధులు ఇక ముస్లిం క్రిస్టియన్ కార్యక్రమాలకు కూడా వెళ్తున్నారని... అలాంటి ఫోటోలు తీసుకుని ఇక తమ అభ్యర్థిని క్రిస్టియన్ అని అందరిని నమ్మించే ప్రయత్నం బిజెపి చేస్తుంది అని మండిపడుతున్నారు. ఇక మరికొంతమంది ఫోటోలను మార్పింగ్ చేసి బిజెపి కొత్త నాటకానికి తెర లేపింది అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: