జూనియర్ ఎన్టీఆర్ గొప్ప యాక్టర్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన ఎంతటి కష్టమైనా డాన్స్ స్టెప్పులైన సులువుగా చేయగలరు. దివంగత నటుడు
నందమూరి తారక రామారావు కూడా జూ.
ఎన్టీఆర్ గొప్పవాడు అవుతాడని గ్రహించారు. ఆయన గ్రహించినట్టే
తారక్ తన స్వశక్తితో
టాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు విశ్వసనీయమైన అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. అయితే
ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే చూడాలని చాలా మంది అభిమానులు వేయి కళ్ళతో వేచి చూస్తున్నారు. అయితే తాజాగా ఒక అసిస్టెంట్
డైరెక్టర్ తారక్ అభిమానులకు ఒక
గుడ్ న్యూస్ చెప్పారు.
ఎన్టీఆర్ సుబ్బు
సినిమా కి జీకే
చౌదరి కో-డైరెక్టర్ గా పని చేశారు. అయితే ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జూ.
ఎన్టీఆర్ ప్రతి ఒక్కరితో చాలా స్నేహపూర్వకంగా మెలిగే వారిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుబ్బు
సినిమా సెట్స్ లో తనతో చాలా క్లోజ్ గా ఉండేవారని.. అదిచూసి తాను ధనవంతుడనని భావించి తన ఇంటి ఓనర్ రెండు వేల రూపాయలు అద్దె పెంచారని ఆయన నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన
ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఎన్టీఆర్ తనతో మాట్లాడుతూ.. "నేను పది సంవత్సరాల పాటు ఫిల్మ్
ఇండస్ట్రీ లో
హీరో గా కొనసాగి మంచి పేరు తెచ్చుకుని ఆ తర్వాత పాలిటిక్స్ లోకి రంగప్రవేశం చేస్తాను," అని చెప్పారని
చౌదరి వెల్లడించారు.
దీంతో
ఎన్టీఆర్ కి సహజంగానే పాలిటిక్స్ లోకి రావాలనే ఆలోచన ఉందని స్పష్టమవుతోంది. అయితే ఈ విషయాలు తెలుసుకున్న
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి 2009లో ఎన్నికల ప్రచారంలో
యాక్సిడెంట్ జరిగిన తర్వాత
జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉన్నారు. కానీ ఆయనకు రాజకీయవేత్త కావాలని ఉంది కాబట్టి కొద్ది రోజులు ఆలస్యమైనా ఆయన తప్పకుండా రాజకీయాల్లోకి వస్తారని
ఎన్టీఆర్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.