ఎల్ఐసి ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పాలసీదారులకు ముఖ్య గమనిక..?

praveen
అతి పెద్ద ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రస్తుతం తమ కస్టమర్ల కోసం ఎన్నో రకాల పాలసీలను అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం తమ పాలసీదారుల సంఖ్య అంతకంతకూ పెంచుతూ దూసుకుపోతుంది. అయితే ప్రస్తుతం ఆ సంస్థలో ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలకు సేవలు అందిస్తూ ఎంతో నమ్మదగిన సంస్థగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పేరుగాంచింది. ఇక ప్రస్తుతం ఎవరైనా పాలసీ తీసుకోవాలి అంటే ఎక్కువగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో పాలసీ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త పాలసీలను తీసుకు వస్తూ ఉంటుంది ఎల్ఐసి  .



 అయితే ఒకవేళ మీకు అతి పెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయినా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగులుగా కానీ కస్టమర్లుగా కానీ ఉంటే ఈ వార్త మీకోసమే. ఎల్ఐసి  ఉద్యోగులకు రెండు గుడ్ న్యూస్ లు అందించింది సంస్థ. అంతేకాకుండా పాలసీదారులు కూడా ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సి ఉంది.  కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుని 1.14 లక్షల మంది ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.  కేవలం వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది  ఈ క్రమంలోనే ఇకనుంచి ఎల్ ఐ సి ఎంప్లాయిస్ అందరూ కూడా వారంలో రెండు రోజుల పాటు సెలవులో ఉండనున్నారు. ఇది అటు ఎల్ఐసి ఉద్యోగులందరికీ గొప్ప శుభవార్త అనే చెప్పాలి.



 అదే సమయంలో అటు ఎల్ఐసి పాలసీ దారులు కూడా ఈ విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి శనివారం ఎల్ఐసి ఆఫీస్  ఉండదు అన్న విషయాన్ని గమనించాలి సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే కస్టమర్లు వారి పనులు పూర్తి చేసుకోవడానికి ఎల్ఐసి ఆఫీస్ను సంప్రదించే అవకాశం ఉంది అని  అందరు గమనించాలి.  అయితే ఎల్ఐసి ఉద్యోగులకు కేవలం వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలను ఉండేలా నిర్ణయం తీసుకోవడమే కాదు ఇక ఉద్యోగులందరికీ కూడా 25 శాతం మేర వేతన పెంపుకు కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: