షర్మిల గురించి తుమ్మల వేసిన లెక్క ఇది...?

తెలంగాణలో రాజకీయంగా సీఎం కేసీఆర్ బలంగా ఉన్నా సరే కొన్ని ఇబ్బందులు మాత్రం సీఎం కేసీఆర్ వచ్చే అవకాశాలు ఉండవచ్చు అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల విషయంలో ఎవరి సలహాలను కూడా ఆయన తీసుకునే అవకాశం ఉండదు. నిర్ణయాల విషయంలో దూకుడుగా ముందుకు వెళుతూ ఉంటారు. దీని వలన సమస్యలు కూడా పెరుగుతున్నాయి అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. కొన్ని కొన్ని నిర్ణయాల విషయంలో పార్టీలో చాలా మంది నేతలు సీఎం కేసీఆర్ కు తమ అభిప్రాయాలు చెప్పాలని భావించిన సరే అవకాశం ఇవ్వడం లేదని కొంతమంది అంటున్నారు.

 అయితే ఇప్పుడు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో షర్మిల బలం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆమె విషయంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు జాగ్రత్తపడుతూ టిఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాకు సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్  పార్టీ అధిష్టానానికి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. నాగేశ్వరరావు ఇటీవల కొంతమంది కీలక నేతలతో చర్చలు జరిపిన సందర్భంగా తెలంగాణలో షర్మిల ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఏంటనే దానిపై ఒక అంచనాకు వచ్చారు.

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేపథ్యంలో ఆయన కొన్ని లెక్కలు కూడా వేసుకున్నారు. లెక్కల ఆధారంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు ఆమె పార్టీ ఎనిమిది నియోజకవర్గాల్లో ప్రభావం చూపించే అవకాశాలు ఉండవచ్చన్న అంచనా వేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆమెకు మద్దతు ఇస్తే 10 నియోజకవర్గాల్లో కూడా షర్మిల పార్టీ విజయం సాధించిన ఆశ్చర్యంలేదని నల్గొండ జిల్లాలో కూడా అదేవిధంగా పరిస్థితులు ఉన్నాయని తుమ్మల నాగేశ్వరరావు ఒక నివేదిక రెడీ చేసినట్లుగా సమాచారం. ఈ నివేదికను సీఎం కేసీఆర్ పంపించాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: