రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు...?
రోజుకి వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. దీనితో మళ్ళీ ఆయా రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా ప్రయత్నాలు మొదలెట్టాయి. ఇప్పటికే మహారాష్ట్ర లాక్ డౌన్ ప్రకటించగా. ఈ రోజు ఢిల్లీ రేపటి నుండి లాక్ డౌన్ ప్రకటించింది. ఇది ఇలా ఉంటే మరో వైపు దేశమంతా వ్యాక్సినేషన్ ప్రజలందరికీ ఇస్తూ ఉన్నారు. మొదటగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కి వ్యాక్సిన్ ఇవ్వగా, ఇప్పుడు 45 సంవత్సరాల పైబడి ఉన్న వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించి కొన్ని కీలకమైన ఉత్తర్వులను రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. లాక్ డౌన్ కొనసాగుతున్న రాష్ట్రాలలో ఉన్న ప్రజలు ఆయా సమయాలలో వ్యాక్సినేషన్ సెంటర్ కి వెళ్ళడానికి అనుమతులిచ్చింది.
కొన్ని రాష్ట్రాలలో పగలు లాక్ డౌన్ ఉంది..మరి కొన్ని రాష్ట్రాలలో రాత్రి లాక్ డౌన్ ఉంది. వ్యాక్సినేషన్ కోసం వెళ్లే ప్రజలపై కేసులు పెట్టకుండా ఉండాలని ఆదేశాలిచ్చింది. అంతే కాకుండా వ్యాక్సినేషన్ కోసం వెళ్లేవారికి మార్గ మధ్యంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చేయాలనీ...అలాగే వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత కూడా వారు క్షేమంగా ఇంటికి చేరే విధంగా చూడాలని ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. పరిస్థితులు మన చేయి దాటుతున్న తరుణంలో ఎప్పటికప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకుంటూ సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలని ఈ గైడ్ లైన్స్ లో అన్ని రాష్ట్రాలకూ తెలిపింది.