అమరావతి దెబ్బకు వేలల్లో కుప్పకూలిపోయారు...?

VAMSI
ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించిన నాటి నుండి అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఆశలు కలిగాయి. అయితే ఈ అమరావతి వలన కొన్ని వర్గాల వారికి తీవ్రమైన దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే భారీ గా అంచనాలు పెట్టుకుని అమరావతి పరిసర ప్రాంతాలలోని భూములను విచ్చలవిడిగా కొనేసి పెట్టుకున్నారు. ఎవ్వరైతే మొదట్లోనే 20 లేదా 30 లక్షల వరకు డబ్బులు పెట్టి కొన్నారో వారికి ఈ రోజు వరకు కూడా ఎటువంటి నష్టం లేదు. ఎందుకంటే అక్కడ భూమిని ఈ రోజు అమ్ముకున్నా సరే ఖచ్చితంగా 40 లక్షలు వస్తుంది. ఎక్కువచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ అమరావతిని రాజధానిగా ప్రకటన వెలువడిన నెల రోజుల తరువాత మరి కొంతమంది లక్షలు విలువచేసే అదే భూములను కోట్లు పెట్టి కొన్నారు.

అయితే ఇలా కొన్నవారి దగ్గర నిజంగా అంత డబ్బు ఉందా అంటే...అదీ లేదు.. అప్పు తీసుకోవడం, తెలిసిన వారి దగ్గర తీసుకోవడం...ఇలా రకరకాలుగా డబ్బులు పెట్టి కొన్నారు. ఇప్పుడు వీరి పరిస్థితి ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా కృష్ణా మరియు గుంటూరు జిల్లాలోని కొంత మంది కొన్ని రోజుల క్రితం వారికున్న స్వంత వ్యాపారాలను సైతం అమ్ముకున్నారు.  ఇందులో రకరకాల ఆస్తులున్నాయి...కొంతమంది సొంత ఇళ్ళను అమ్ముకున్నారు...మరి కొంతమంది కాటన్ మిల్లులను అమ్ముకున్నారు...మరి కొంతమంది ఐపీ పెట్టిన వారు కూడా ఉన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. కృష్ణ గుంటూరు జిల్లాలో ఉన్న అక్కడి వస్త్ర వ్యాపారులు వారి దగ్గరున్న కొంత డబ్బుతో మరి కొంత అప్పు తీసుకుని కోట్లు పెట్టి భూములను కొనేశారు. వారికి భూమి మాత్రం వారిదే..కానీ ఈరోజు ఆ భూమి విలువ 50 లక్షలు కి మించి ఉండట్లేదు.

ఒక ఎకరా భూమిని కొన్నది చాలా తక్కువమంది. ఎక్కువ మొత్తంలో కొన్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. అంతెందుకు ఒక వ్యాపారుల సమూహం కలిపి మొత్తం 800 నుండి 900 ఎకరాల స్థలం కొన్నారు. ఇలాంటి వారంతా ఇప్పుడు ఇబ్బందులుపాలవుతున్నారు. కనీసం ఈ భూములను అమ్ముకుందామంటే కొనేవారు లేరు. ఇప్పుడు దాదాపు 1000 మంది వరకు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. త్వరలో దీనికి సంబంధించి ఏమైనా పరిష్కారం  ఉంటుందా చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: