ఎన్నికలు రద్దు చేయండి.. బిజెపి అభ్యర్థి పిటిషన్ సంచలనం..?

praveen
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఇక ఈ ఉప ఎన్నిక ఆంధ్ర రాజకీయాలను ఊపేసింది. ఉప ఎన్నికకు ముందు ఉప ఎన్నిక తర్వాత కూడా ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలు ఎంతో వాడివేడిగా కొనసాగుతున్నాయి.  ఉప ఎన్నిక పోలింగ్ జరగడానికి ముందు ఇక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల కాగానే అన్ని పార్టీలు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.  ఈ క్రమంలోనే తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం సాధించి అధికార పార్టీకి ఊహించని షాక్ ఇవ్వాలి అని  ప్రతిపక్ష పార్టీలన్నీ ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేశాయి.


 మరోవైపు ఇక ఈసారి కూడా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అని అధికార పార్టీ నేతలు అందరూ ధీమాతో ఉన్నారు. ఇటీవలే ఎంతో ప్రతిష్టాత్మకంగా తిరుపతి ఉప ఎన్నిక జరిగింది. అయితే ఇక తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ లో భాగంగా అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా అధికార వైసిపి కొంతమంది ని తీసుకొచ్చి ఇక  దొంగ ఓటింగ్ కి పాల్పడింది అంటూ అటు ప్రతిపక్షం టిడిపి బిజెపి పార్టీలు ఇక ఏకంగా కొన్ని వీడియోలను కూడా సోషల్ మీడియాలో విడుదల చేయడం సంచలనం గా మారిపోయింది. వెంటనే ఎన్నికలు రద్దు చేయాలంటూ ఎన్నికల సంఘాన్ని కూడా కోరాయ్ ప్రతిపక్ష పార్టీలు.



 తిరుపతి ఉప ఎన్నికలను సమర్థవంతంగా పారదర్శకంగా నిర్వహించడంలో ఏపీ ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని చంద్రబాబు విమర్శలు కూడా చేశారు. ఇక ఇటీవలే ఏకంగా ఉప ఎన్నిక రద్దు చేసి పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని  మళ్ళీ కొత్తగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.  పిటిషన్ దాఖలు చేసింది ఎవరో కాదు బిజెపి తరఫున తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన రమాప్రభ. తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేసి మళ్ళీ కొత్తగా నిర్వహించాలని రమ ప్రభ పిటిషన్ వేయడం సంచలన గా మారిపోయింది అని చెప్పాలి. అయితే దీనిపై హైకోర్టు ఎలా స్పందిస్తుంది అనేది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: