కని "కరోనా": ప్రపంచంలో మన దేశమే నెంబర్ వన్..?
అంతకు మించి అనే రేంజ్ లో భారత్లో వైరస్ కేసులు నమోదవుతున్నాయి. కాగా ప్రస్తుతం కరోనా కేసుల్లో ఇండియా మొదటి స్థానంలో ఉందని ఇటీవల వెలువడిన ఫలితాల్లో తేలింది. ఒక్కరోజులోనే మూడు లక్షల కేసుల మార్కు దాటింది ఇండియా ప్రపంచంలోనే అతి ఎక్కువ కేసులు ఉన్న దేశాలలో మొదటి స్థానంలో నిలిచింది. గత 24 గంటల్లో 3,15,552 కొత్త కేసులు నమోదయ్యాయి. అన్ని దేశాల్లో కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ భారత్లో మాత్రం తక్కువగా కేసులు ఉండేవి కానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అదే రీతిలో కేసులు కొనసాగుతున్నప్పటికీ భారత్లో మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎక్కడ వైరస్ విజృంభణ మాత్రం ఆగడం లేదు..
ఇండియాలో వైరస్ కేసులు భారీగా పెరగడానికి మహారాష్ట్ర కేరాఫ్ అడ్రస్ గా మారిపోతుంది. అన్ని రాష్ట్రాలలో కంటే ఒక్క మహారాష్ట్రలోని కరోనా వైరస్ కేసుల సంఖ్య అత్యధికంగా నమోదవుతుంది. ఇక ఆ తర్వాత స్థానంలో దేశరాజధాని ఢిల్లీ ఉంది. ఈ క్రమంలోనే ఇక కరోనా వైరస్ కేసులు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా రంగం లోకి దిగింది కఠిన ఆంక్షలు అమలులోకి తెస్తోంది అదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ కూడా వ్యాక్సిన్ ఇచ్చేందుకు సిద్ధమైంది.