కని కరోనా : నువ్వు దేవుడు సామీ.. రూ.1 కే ఆక్సిజన్ సిలిండర్.?
ఫస్ట్ వేవ్ లో భాగంగా కేవలం దగ్గు జలుబు జ్వరం లాంటివి మాత్రమే లక్షణాలు ఉండి రోగులు కొంచెం ఇబ్బంది పడేవారు కానీ ఇక సెకండ్ వేవ్ లో భాగంగా కరోనా వైరస్ సోకితే ఏకంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఎంతోమంది ఇక ఆస్పత్రులకు వెళ్లి పోతున్నారు. ఇక ఆస్పత్రిలో ప్రతి ఒక్కరికి కూడా వెంటిలేటర్‌పై ఉంచి ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే దేశంలో ఆక్సిజన్ కొరత రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇక ఆక్సిజన్ కొరత తీర్చేందుకు అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నో చర్యలు చేపడుతుంది.
ఈ క్రమంలోనే కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి దేశంలో అవసరమైన చోట ఆక్సిజన్ పంపిణీ చేసేందుకు ముందడుగు వేస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఆక్సిజన్ కి బాగా డిమాండ్ పెరిగి పోయిన నేపథ్యంలో ఒక ఆక్సిజన్ సిలిండర్ దాదాపు 30 వేల వరకు పలుకుతోంది. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం దేశం మొత్తం ప్రాణవాయువు అందక కొట్టుమిట్టాడుతుంటే ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారి పెద్ద మనసు చేసుకొని ఎంత మంది ప్రాణాలను కాపాడటానికి సిద్ధమయ్యాడు. హమీర్పూర్ కి చెందిన మనోజ్ గుప్తా తన పరిశ్రమలో ఆక్సిజన్ సిలిండర్లు నింపి ఒక రూపాయికే విక్రయిస్తున్నాడు. దాదాపు 1000 సిలిండర్లను ఒక్క రూపాయికే విక్రయించాడు ఈ వ్యాపారి. అయితే తాను కూడా కరోనా వైరస్ బారిన పడ్డానని ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు.