మాజీ మంత్రికి అంత చిన్న విషయం తెలియకపోవడం విడ్డూరంగా ఉందే...?
తాజాగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ "ఏసీబీ మరియు సిఐడి సంస్థలు స్వతంత్ర ప్రతి పత్తి కలిగినవని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఈ రెండు సంస్థలు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లుగా వింటున్నాయని, అలా కాకుండా తమ స్వంతంగా విచక్షణ ఉపయోగించి కార్యకలాపాలు కొనసాగించాలని, ఈ రెండు సంస్థల పెద్దలకు ఉపదేశం చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్ లో హాస్యాన్ని పండిస్తున్నాయి. ఈ విషయంపై కొంత మంది రాజకీయ విశ్లేషకులు ఈ విధంగా అంటున్నారు. గతంలో ఒక మంత్రిగా పనిచేసిన అయ్యన్నపాత్రుడికి ఏసీబీ మరియు సి ఐ డి సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంలో భాగమే అని తెలియకపోవడం హాస్యాస్పదమని విమర్శిస్తున్నారు.
మరియు ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా ఇలాంటి సంస్థలు వ్యవహరించడం సాధారణమే అని ఈయన పైన పంచ్ లు వేస్తున్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి సంస్థలను తమకు అనుకూలంగా ఉపయోగించుకున్న సందర్భాలను గుర్తు చేస్తున్నారు. దీనితో ఇకనైనా ఇలాంటి అధికారిక విషయాలపై మాట్లాడే ముందు పూర్తి వివరాలను తెలుసుకుని మాట్లాడాలని ఛలోక్తులు విసురుతున్నారు.