కని కరోనా : కరోనాపై గెలిచినందుకు సంబరాలు చేసుకుంటున్న ఆ దేశం...

Purushottham Vinay
ఓ వైపు కరోనాతో భారతదేశం అతలాకుతలం అవుతుంది. రోజుకి ఎన్నో లక్షల కేసులు నమోదవుతున్నాయి. ఎంతోమంది చనిపోతున్నారు. అలాగే మరణాలను అదుపు చెయ్యలేక డాక్టర్లు చేతులెత్తేసే పరిస్థితి నెలకొంది. ఇక మరోవైపు న్యూజిలాండ్ మాత్రం ఆ మహమ్మారిని జయించి పండుగ చేసుకుంటోంది. శనివారం రాత్రి ఏకంగా 50 వేల మందితో దేశంలోని అతిపెద్ద స్పోర్ట్స్ స్టేడియంలో లైవ్ మ్యూజిక్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ ప్రపంచమంతా కరోనా మహమ్మారి గుప్పిట్లో ఉన్నా.. తాము మాత్రం సాధారణ జీవితాలు గడపగలం అని మా నగరం నిరూపించిందని ఆక్లాండ్ మేయర్ ఫిల్ గోఫ్ ఘనంగా ప్రకటించారు.కరోనా మహమ్మారీ మొదలైన తర్వాత ఇంత భారీ స్థాయిలో వేడుకల నిర్వహించడం ఇదే ప్రధమం అని చెప్పాలి. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ బ్యాండ్ సిక్స్60 ప్రేక్షకులను తమ సంగీతంతో ఉర్రూతలూగించింది.ఈ ఈవెంట్‌ను దక్షిణ పసిఫిక్ దేశాలలో లైవ్ స్ట్రీమ్ చేయడం విశేషం. మాస్క్‌లు, భౌతిక దూరాలు అవసరం లేకపోవడంతో అక్కడి మ్యూజిక్ లవర్స్ ఈ కాన్సర్ట్‌ను ఎంతగానో ఎంజాయ్ చేశారు.

ఇక కరోనాని కట్టడి చెయ్యటం న్యూజిలాండ్ కి ఎలా సాధ్యమైందంటే కరోనాను నియంత్రించడానికి ఆ దేశం అత్యంత కఠినంగా వ్యవహరించింది. తమ ప్రజలను కాపాడుకోడానికి అంతర్జాయతీ సరిహద్దులను మూసేసింది. పెద్ద సంఖ్యలో కరోనా టెస్టులు చేసింది.అంతేగాక ప్రైమరీ కాంటాక్ట్‌లను శరవేగంగా గుర్తించింది.మొత్తంగా ఇప్పటి వరకూ న్యూజిలాండ్‌లో నమోదైన కరోనా కేసులు 2600 మాత్రమే కాగా.. కేవలం 26 మంది మాత్రమే చనిపోయారు. అంతర్జాతీయ సరిహద్దులను మూసివేయడం ద్వారా తమ టూరిజం దారుణంగా దెబ్బ తిన్నా ఆ దేశం పెద్దగా బాధపడలేదు. ఎందుకంటేముందు ఈ కరోనా పూర్తిగా తొలగిపోతే చాలనుకుంది.ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియాకు మాత్రమే తన సరిహద్దులను తెరిచింది న్యూజిలాండ్..ఇక మనకు త్వరలో కరోనా ని జయించి సంబరాలు చేసుకునే రోజులు రావాలని కోరుకుందాం. కాబట్టి మాస్కులు ధరించండి.జాగ్రత్తలు పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: