హలో బ్రదర్ మీకే చెప్పేది..18 ఏళ్ళు నిండాయా..?
ఇక మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియలో 45 సంవత్సరాలు నిండిన వారందరికీ కూడా టీకా ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు టీకా ప్రక్రియను శరవేగంగా కొనసాగిస్తూన్నాయి అయితే దేశంలో రోజురోజుకీ కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయడమే కాదు ప్రతి ఒక్కరికి టీకా అందే విధంగా చేయడానికి మే 1వ తేదీ నుంచి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ క్రమంలోనే మే 1 నుంచి దేశ వ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన అందరికీ కూడా అందించనున్నారు అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి అనుకున్న వారు కోవిన్ వెబ్సైట్ లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా ఈ నెల 28వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కొంతమంది యువత టీకా తీసుకోవడానికి ముందుకు వస్తూ ఉంటే కొంతమంది మాత్రం అనవసరమైన అపోహలతో ఇంకా వెనకడుగు వేస్తూనే ఉన్నారు అయితే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కరోనా వైరస్ ని ఎదుర్కొగలుగుతామని అందుకే ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకోవడం ఎంతో మంచిది అని చెబుతున్నారు నిపుణులు.