జగన్ మొండిపట్టు.. విద్యార్థులకు శాపంగా మారితుందా..?
10వ తరగతి విద్యార్థులందరికీ కూడా తరగతులు నిర్వహిస్తున్నాము అని ఏపీ ప్రభుత్వం చెబుతుంది. అయితే ఓ వైపు ప్రతిపక్ష పార్టీలన్నీ విద్యార్థులు ప్రాణాలు ప్రమాదంలో పెట్టవద్దు అని సూచిస్తున్నప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎక్కడ ప్రభుత్వం తీరు మాత్రం మార్చుకోవడం లేదు. అయితే రోజురోజుకు కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అటు ప్రభుత్వం వ్యవహరిస్తున్న మొండి వైఖరి కాస్త విద్యార్థుల పాలిట శాపంగా మారుతుంది అని అర్థమవుతుంది. ఇప్పటికే ఎంతో మంది విద్యార్థులు వైరస్ బారిన పడగా ఇటీవలే మరి కొంత మంది విద్యార్థులు కూడా వైరస్ బారిన పడ్డారు.
పశ్చిమగోదావరి జిల్లా చెరుకువాడ పాఠశాలలు పదిమంది టెన్త్ క్లాస్ విద్యార్థులకు పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. కొమ్ముచిక్కాల లో మరో ఐదు మంది విద్యార్థులకు తణుకు భాయ్స్ పాఠశాలలో ఒకరికి నర్సాపురం లో ఒక విద్యార్థికి కరోనా వైరస్ సోకింది అని ఇటీవలే తేలింది. ఇలా కొంత మంది విద్యార్థులకు కరోనా వైరస్ సోకడంతో డిఈఓ ఆదేశాల మేరకు మిగతా విద్యార్థులందరికీ కూడా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది ఇక ఈ పరీక్షల్లో ఎంతమందికి పాజిటివ్ గా నిర్థారణ అవుతుంది అన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంటుందా లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.