కని కరోనా : సంప్రదాయ శక్తితోనే కరోనా వైరస్‌కు చెక్..?

Chakravarthi Kalyan
కరోనా వైరస్ మానవ, పశు వైరస్‌ల సంకరంతో పుట్టింది. ఈ కరోనా వైరస్ 90 వరకూ మ్యుటేషన్లు పొందే అవకాశం ఉంది. అవి మానవ కణంలో ప్రవేశించి మన జీవ వస్తువును  వాడుకొని వాటి జీరాక్సులను తయారుచేసుకుంటాయి.  ఆ పని ప్రతి వైరస్ చేస్తుంది. వైరస్ సహజ ధర్మం మ్యుటేషన్. అంటే తనలోపలి జీవ వస్తువుని మారుస్తుంది. తద్వారా కొత్తకొత్త బాధలు పెడుతుంది.

ఈ బాధలన్నింటికీ కారణం మనమే! వైరస్ కాదు.. వైరస్ నిన్న ఉంది ఇవాళ ఉంది రేపు ఉంటుంది. మనం ఎప్పుడూ వైరస్ తో.. హానికర బాక్టీరియా తో యుద్దం చేస్తూనే ఉంటాం!
ఆ చైతన్యం భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టే మనం యుగాలుగా బ్రతికి ఉన్నాం! ఆ దివ్య చైతన్యం పేరు వ్యాధి నిరోధక శక్తి. నీకు తెలియకుండా ఎన్నో దైవం నీలో చేస్తుంటాడు. మనకి తెలిసి గుండె కొట్టుకోవడం!

ఊపిరి తిత్తులు ఆటోమాటిక్‌గా గాలి పీల్చుకోవడం ఇలా మనకి తెలియనివి చాలా లోపల జరుగుతుంటాయి. నీ మెదడులో జ్ఞాపకాలు ఎలా నిక్షిప్తం అవుతాయి నీకు తెలియదు.
స్త్రీ గర్భంలో వీర్యకణం అండం చేసే విన్యాసాలు మనకి తెలియదు. నిద్రలో ఎలా బ్రతికివుంటామో మనకి తెలియదు. అది చేసే శక్తిని దైవ చైతన్యం అంటాం. దైవమ్ ప్రతి జీవికి ఇచ్చినట్టే వైరస్ కి కూడా ఈ శక్తి ని ఇచ్చాడు. వీటి మధ్య జరిగే పోరే
జగన్నాటకం!!

ఈ శక్తిని  ఆ వైరస్ శక్తికి దీటుగా పొందటమే  మనం చేయాల్సింది! మన ప్రాచీనులకు ఈ జ్ఞానం తెలుసు! వారు ఆచరించి బహుకాలం బ్రతికారు. ఇప్పటికీ సంప్రదాయంగా బ్రతికే వారు శతాయుస్సు తో జీవిస్తున్నారు.. అంత దివ్య శక్తి ని భగవంతుడు ఇస్తే మనం దాన్ని పాడుపనులతో పోగొట్టుకుంటున్నాం. శరీరాన్ని రోగాల పాలు చేస్తున్నాం. త్రాగుడు
ధూమపానం అతి సంభోగం అతి తిండి కృత్రిమ తిండ్లు..కల్తీ వస్తువులతో మన చైతన్యం ఖర్చయిపోతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: