అదిరిపోయే గుడ్ న్యూస్.. రెమిడిసివర్ కి ప్రత్యమ్నయం వచ్చేసింది..?
అయితే ఓ వైపు రెమిడిసివర్ కొరకు ఏర్పడటమే కాదు మరోవైపు బ్లాక్ మార్కెట్ దందా కూడా ఊపందుకుంది. రెమిడిసివర్ మందు ఏకంగా 25 వేల నుంచి 45 వేల వరకు కూడా బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కరోనా వైరస్ బారిన పడిన రోగులకు రెమిడిసివర్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో రెమిడిసివర్ ముందుకు ప్రత్యామ్నాయం మందు కూడా వచ్చేసినట్లు తెలుస్తోంది.
రెమిడిసివర్ కు పోటీగా వీరాఫిర్ అనే మందు ప్రస్తుతం తయారవుతుంది. దీనికి ప్రస్తుతం డీజీసీఐ అనుమతి కూడా పొందినట్లు తెలుస్తోంది. విరఫిర్ పరీక్షల్లో ఎంతో మంచి ఫలితాలు చూపించింది అని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ మందు తీసుకోవడం వల్ల ఆక్సిజన్ కు సంబంధించినటువంటి ప్రాబ్లం తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ మందు రెమిడిసివర్ కంటే ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది అని అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుత సమయంలో రెమిడిసివర్ వాడినప్పటికీ ఎంతోమంది ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్నారని కానీ ప్రస్తుతం ఈ మందు ఇస్తే ఏకంగా ఆక్సిజన్ అందక పోవడం లాంటి సమస్య తీరిపోతుంది అని చెబుతున్నారు విశ్లేషకులు. ఇది ఒక రకంగా గొప్ప శుభవార్త అని అంటున్నారు.