మనస్థాపంతో యువకుడి ఆత్మహత్య.. సీఎం కేసీఆరే కారణమా..?
ఈ క్రమంలోనే పోరాడి సాధించుకున్న తెలంగాణలో కూడా తమ బతుకులు మారలేదు అని ఎంతో మంది నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అటు నిరుద్యోగులు ఆత్మహత్యలు ఆగడం లేదు అన్న విషయం తెలిసిందే. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అదిగో విడుదల చేస్తాం ఇదిగో విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతోంది తప్ప. ఎక్కడా ఇది కార్యరూపం దాల్చడం లేదు. దీంతో ఎంతో మంది నిరుద్యోగులు ఎక్కువ అడుగడుగునా నిరాశే ఎదురవుతుంది. ఇప్పటికే ఎంతో మంది నిరుద్యోగులు నిరాశతో ఆత్మహత్య చేసుకోగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో నిరుద్యోగి బలయ్యాడు.
నల్గొండ జిల్లా చండూరు లో శ్రీకాంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నా యువకుడు ఇక ఎంతకీ ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేస్తున్నాడు.తెలంగాణ యూనివర్సిటీ లో పీజీ చదివిన శ్రీకాంత్ ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎన్నో రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తనకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కానీ అతని ఆశలను అడియాశలు గానే మిగిలిపోయాయి. చివరికి ఉద్యోగం రాదు అన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది.