రెండోదేనా .. కరోనా మూడు, నాలుగు దశలున్నాయి : నితిన్ గడ్కరీ
ఇక అన్ని రంగాలు కూడా మెల్లిమెల్లిగా ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడటం మొదలు పెట్టాయి. కానీ అంతలోనే ఊహించని విధంగా మరో సంక్షోభం దూసుకు వచ్చింది. కరోనా వైరస్ ప్రభావం తగ్గింది అనుకునేలోపే సెకండ్ పెరిగిపోయింది. చూస్తూ చూస్తూ ఉండగానే వందల కేసులు వేల లోకి వేల కేసులు లక్షల్లోకి మారిపోయాయి. దీంతో ప్రస్తుతం దేశంలో విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రోజురోజుకు వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువవుతూ ఉండటం ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చేరడం ఇక అక్కడ ఆక్సిజన్ కొరత ఏర్పడి చివరికి ప్రాణాలు కోల్పోవడం లాంటి ఘటనలు కూడా తెర మీదికి వచ్చి ఎంతో మందిని బెంబేలెత్తిస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ప్రజా ప్రతినిధులు ప్రజలందరికీ ధైర్యం చెప్పే విధంగా పలు కీలక సూచనలు చేస్తున్నారు. అయితే తాజాగా కరోనా వైరస్ గురించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండవ దశ కరోనా వైరస్ మాత్రమే కాకుండా మూడు నాలుగవ దశ వైరస్ కూడా వచ్చే అవకాశం ఉందని ప్రజలందరూ ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వానికి సహకరించాలి అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నాయని అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దు అని సూచించారు. దేశంలో ఏర్పడిన ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుంది అంటూ చెప్పుకొచ్చారు నితిన్ గడ్కరీ.