ఏంటీ.. కరోనా సెకండ్ వేవ్ కి రైతులే కారణమా..?
అదే రెండవ దశ కరోనా వైరస్ ఇంతలా శరవేగంగా వ్యాప్తిచెంది విపరీతంగా పెరిగిపోవడానికి అసలు కారణం ఏమిటి అన్న దానిపై ఎంతోమంది ఎంతో భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది దేశంలో ఎన్నికల ప్రచారం కారణంగా వైరస్ కేసులు సంఖ్య పెరిగిపోయింది అని చెబుతూ ఉంటే మరికొంతమంది వినూత్న కారణాలు చెబుతున్నారు. అయితే కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోవడంతో ఇటీవలే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై కేసు నమోదు చేయాలంటూ హైదరాబాద్కు చెందిన ఒక లాయర్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఈ ఫిర్యాదులో పలు కీలక విషయాలను కూడా చర్చించారు ఆయన.
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ శరవేగంగా విస్తరిస్తున్న వైరస్ యూకే లో మ్యూటెట్ అయినటువంటిది అంటూ లాయర్ చెప్పుకొచ్చారు. బ్రిటన్లో శరవేగంగా వ్యాప్తిచెందిన మహమ్మారి కరోనా వైరస్ ఇండియా లోకి రావడానికి రైతు ఉద్యమమే కారణం అంటూ సదరు లాయర్ ఫిర్యాదులో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. రైతుల ఉద్యమానికి మద్దతు పలికేందుకు బ్రిటన్ నుంచి వచ్చిన ఎంతో మంది నాయకులకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించకుండానే దేశంలోకి అనుమతించడం.. రైతు ఉద్యమంలో పాల్గొన్న కారణంగా ఎంతో మందికి వైరస్ వ్యాప్తి చెందింది అని భావిస్తూ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే క్రిమినల్ నెగ్ లిజెన్స్ బేసిస్ మీద ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై విచారణ జరపాలి అంటూ ఆయన కోర్టులో ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారిపోయింది.