అంబానీ ఆదానీలు పరుగో పరుగు ? ఏంది కథ ?

VAMSI
ప్రపంచమంతా కరోనా భయంతో ప్రజలు వణికి పోతున్నారు. సామాన్యుల నుండి కుబేరుల వరకు కరోనా అంటేనే బాబోయ్ అంటున్నారు. మరి ఈ మహమ్మారి సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు ఎవరినీ వదలనంటూ తరుముతోంది. ముంబై, ఢిల్లీ వంటి ప్రాంతాలలో కరోనా వ్యాప్తి పీక్స్ కి చేరింది. వైరస్ వ్యాప్తి వేగం పుంజుకుంది. కేసులు భారీగా పెరుగుతున్న తరుణంలో వీధి వీధికి కరోనా రోగులు ఎక్కువ అవుతున్నారు. కాస్త ఏమరుపాటుగా ఉంటే చాలు కోవిడ్ ఇట్టే అంటుకుపోతోంది. ఇలాంటి సమయంలో ముంబైలోని సాధారణ ప్రజలు ఒకవేళ కరోనా సోకితే విడిగా ఉండేందుకు వారి ఇంట్లో సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతుంటే, సంపన్నులు మాత్రం ఏకంగా నగరాన్ని విడిచి వేరే ప్రాంతాలకు తమ కుటుంబాలతో సహా వెళ్లిపోతున్నారు.

అదే ముంబై నగరంలో ఉన్నటువంటి అపర కుబేరులు, ప్రపంచంలోనే భారీ సంపన్నులలో ఒకరైన రిలయన్స్ అధినేత  ముకేశ్ అంబానీ కరోనా వ్యాప్తి శరవేగంగా పెరుగుతుండడంతో  ముంబై లోని తన లగ్జరీ బంగ్లాను వదిలి గుజరాత్ లో అతి తక్కువ జనసాంద్రత గల జామ్ నగర్ లో తమ మరో నివాసానికి ఫ్యామిలీ తో సహా షిఫ్ట్ అయ్యారు. కరోనా విజృంభిస్తున్న వేళ ఇలాంటి నిర్ణయం తప్పలేదంటున్నారు ముకేశ్ అంబానీ. మరో కుబేరుడు గౌతం అధాని సైతం ఇదే దారిని ఎంచుకున్నారు. దేశంలో సంపన్నుల జాబితాలో ముకేశ్ అంబానీ తర్వాత స్థానం ఈయనదే. అయితే ఈయన కూడా ముంబైని వీడి తన కుటుంబంతో కరోనా తీవ్రత తక్కువ ఉన్న ప్రాంతానికి వెళ్ళిపోయారు.

ఇలా దేశంలోని పలువురు ప్రముఖులు ప్రస్తుతం వారి వ్యాపారాలు మరియు సంపాదన కన్నా ప్రాణం మిన్న అనుకుని కరోనా తాకిడి తక్కువగా ఉన్న ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఇదే విధంగా ఇన్ఫోసిస్ అధినేత గోపాలకృష్ణన్ సైతం తన సిబ్బందితో బయోబబుల్ లో ఉన్నారు. ఇన్ఫోసిస్ కే చెందిన మరో వ్యక్తి నందన్ నీలేకని సైతం బెంగళూర్ లో బయో బబుల్ ఉన్నారు. ఇలా వీరంతా బయట ప్రపంచంతో పూర్తిగా సంబంధాలను తెంచుకుని వారి లోకంలోనే ఉన్నారు. దీనిని బట్టి ఎంత సంపన్నులైనా ప్రాణ భయంతో పరుగులు తీయడం తప్పదని తెలుసుకున్నారు. ఇది తెలిసిన సాధారణ ప్రజలు  షాక్ కు గురవుతున్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: