18 మందికి కరోనా అంటించి పొట్టనబెట్టుకున్న సిగిరెట్...
ఆఫీస్ పనిమీద కొన్ని రోజుల క్రితం బయటకు వెళ్లాడు. వెళ్తూ… వెళ్తూ…ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే జూబ్లీహిల్స్ చెక్ పోస్టుకు పక్కనే ఉన్న పార్క్ దగ్గర ప్రశాంతత కోసం ఆగాడు. జాలీగా ఓ సిగిరెట్ కాల్చాలని అనుకున్నాడు.కానీ జేబులో అగ్గిపెట్టె లేకపోతే దూరంగా సిగిరెట్ కాలుస్తున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి అతను కాలుస్తున్న సిగిరెట్ నుంచి తన సిగిరెట్ కి నిప్పు అంటించుకున్నాడు.అప్పటి వరకూ బాగానే ఉంది.కానీ..ఆతరువాత మూడు రోజుల తర్వాత జ్వరం, ఒంటి నొప్పులు మొదలయ్యాయి. అంతకంతకూ తీవ్రత పెరిగింది. వెంటనే ఊపిరి ఆడట్లేదు. దాంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. సీటీస్కాన్ చేయించారు. ఇంకేముంది? కరోనా పాజిటివ్ అని తేలింది. అసలే పొగరాయుడు కావటంతో ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయని డాక్టర్లు చెప్పారు. అతను మార్కెటింగ్ మేనేజర్ కాబట్టి..అదే విషయాన్ని తన టీం ఉంటున్న మొత్తం 20మంది మెంబర్స్ కు చెప్పాడు. దీంతో వాళ్లంతా అనుమానంతో కరోనా టెస్టులు చేయించుకున్నారు.
18 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఇంకేముంది? అందరూ ఐసోలేషన్ లో కెళ్లిపోయారు. ఆ 18 మంది నుంచి ఇంకెంత మందికి కరోనా సోకిందో చెప్పలేం. వాళ్లతో కాంటాక్ట్ అయినవాళ్లకు..వారి కుటుంబ సభ్యులకు కూడా టెస్ట్ లు చేయిస్తుండగా మరి ఇంకా ఎన్ని పాజిటివ్ లు వస్తాయో తెలీకుండా ఉంది.ఇలా తమ టీమ్ లో 18మందికి పాజిటివ్ రావటంతో మేనేజర్… తనకు కరోనా ఎలా సోకిందా? అని ఆలోచించగా..బాగా గుర్తు తెచ్చుకోవటానికి మరో సిగిరెట్ వెలిగించి..వారం నుంచి ఆయన ఎవరెవర్ని కలిశాడో గుర్తు తెచ్చుకుని డాక్టర్లకు చెప్పాడు.ఇది సంగతి. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది.