ఇజ్రాయిల్ తరహాలోనే ఫ్రాన్స్.. మాస్క్ పై కీలక నిర్ణయం..?

praveen
భారత్ లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. రోజురోజుకు కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. మొన్నటి వరకు అతి తక్కువ కేసులు ఉన్న దేశంగా ఉన్న భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే అతి ఎక్కువ కేసులు ఉన్న దేశం గా మారిపోయింది. ప్రతిరోజు నాలుగు లక్షల వరకు కరోనా వైరస్ కేసుల సంఖ్య వెలుగులోకి వస్తుంది.  అయితే ఓ వైపు భారత్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న తరుణంలో అగ్రరాజ్యాలలో మాత్రం కరోనా వైరస్ కేసులు సంఖ్య పూర్తిగా కంట్రోల్ లోకి వచ్చింది అనే చెప్పాలి. ఎంతలా అంటే ఏకంగా అక్కడి ప్రభుత్వాలు తప్పనిసరిగా మాస్కు పెట్టుకోవాలి అనే నిబంధనను తొలగించి మాస్కు తప్పని సరి కాదు అంటూ ప్రకటించెంతలా ప్రస్తుతం విదేశాల్లో కరోనా వైరస్ ప్రభావం తగ్గింది.



 ముఖ్యంగా ఇలా మొదటగా ఇజ్రాయిల్ దేశం ప్రకటన చేసింది అన్న విషయం తెలిసిందే. తమ దేశంలో పూర్తిగా వాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసింది ఇజ్రాయిల్. ఇక ఆ తర్వాత దేశ ప్రజలందరికీ మాస్కు పెట్టుకోవడం తప్పనిసరి కాదు చెప్పేసింది. కేవలం గ్రూపులు గా ఉన్నవాళ్లు మాత్రమే మాస్క్ ధరించాలని అక్కడి ప్రభుత్వం సూచించింది. ఇక ఆ తర్వాత అమెరికా కూడా ఇదే నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే. బహిరంగ ప్రదేశాల్లో మాసం ధరించడం తప్పనిసరి కాదు అంటూ ప్రకటించింది అమెరికా ప్రభుత్వం.  ఇటీవలే మరో దేశం కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకుంది.



 ఇప్పటికే ఇజ్రాయెల్ అమెరికా లాంటి దేశాలు మాత్రం తప్పనిసరి కాదు అంటూ నిర్ణయం తీసుకోగా ప్రస్తుతం ఫ్రాన్స్ కూడా ఇలాంటి తరహా నిర్ణయం తీసుకుంది. దేశ ప్రజలందరూ మాస్క్ ధరించడం తప్పనిసరి కాదు అంటూ స్పష్టం చేసింది ఫ్రాన్స్ ప్రభుత్వం. కేవలం గ్రూపులు గా ఉన్నప్పుడు మాత్రమే మాస్క్ పెట్టుకోవాలి అంటూ తెలిపింది. ప్రపంచ దేశాలు ఒక్కొక్కటిగా కరోనా వైరస్ ప్రభావం నుంచి బయట పడుతున్నాయి. టీకా ప్రక్రియ కూడా శరవేగంగా జరుగుతుంది   కానీ భారత్లో మాత్రం మునుపెన్నడూ లేని విధంగా కరోనా వైరస్ కేసులు సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: