శ్రీవారి హుండీ ఆదాయం ఇంత తక్కువా.?

praveen
గత ఏడాది కరోనా వైరస్ వెలుగు లోకి వచ్చిన సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలు అన్ని మూతపడ్డాయి ఈ క్రమంలోనే దేవుడికి భక్తులకు మధ్య ఎంత దూరం పెరిగిపోయింది. ఆ తర్వాత కరోనా కేసుల సంఖ్య తగ్గినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో దేవాలయాలు తెరుచుకోవడానికి వీలు లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్లాక్ మార్గదర్శకాలు రావడం ఆ తర్వాత ప్రముఖ దేవాలయాలు తెరుచుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఎంతోమంది భక్తులు  ఇక దేవుని దర్శించుకోవడానికి భారీగా తరలివచ్చారు  ఇక ప్రముఖ దేవాలయమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా భక్తుల తాకిడి భారీగా పెరిగింది.



 ఈ క్రమంలోనే ఇక శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో వచ్చింది   కానీ గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్  చేస్తూ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో అటు ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు ఈ క్రమంలోనే ఇక తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి కాలు బయట పెట్టడం లేదు ఇలాంటి నేపథ్యంలో రోజురోజుకు శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గిపోతుంది.  అటు కరోనా వైరస్ కేసులు నేపథ్యంలో టీటీడీ బోర్డు సభ్యులు కూడా ఆంక్షలు విధిస్తూ ఉండడంతో  భక్తులు తక్కువ సంఖ్యలోనే శ్రీవారి దర్శనానికి వస్తున్నారు.



 భక్తుల సంఖ్య భారీగా తగ్గడంతో హుండీ ఆదాయం కూడా పడిపోతుంది అని అర్థమవుతుంది దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రస్తుతం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. నిన్న ఒక్కరోజులోనే 9703 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు ఈ క్రమంలోనే నిన్న హుండీ ఆదాయం 46 లక్షల వరకు వచ్చింది. అయితే కరోనా వైరస్ తర్వాత ఇంత తక్కువ మొత్తంలో  ఆదాయం రావడం ఇదే మొదటిసారి అని చెప్పాలి. ఇక ప్రస్తుతం దేశంలో రోజురోజుకు  వైరస్ కేసులు పెరిగిపోవడం చూస్తుంటే ఏ క్షణంలో లాక్డౌన్ అమలులోకి వస్తుందో కూడా అర్థం కాని విధంగా మారిపోయింది పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: