డబ్బు లేని రాజకీయం.. జగన్ సరికొత్త అధ్యాయం.?

praveen
రాజకీయాలంటేనే డబ్బుతో కూడుకున్నవి... ఒకప్పుడు ఓటర్లు ఇక మంచి చేసేవాళ్లను చూసి ఓట్లు వేశారేమో కానీ  నేటి రోజుల్లో మాత్రం ప్రతి ఒక్కరు కూడా డబ్బుకు అమ్ముడు పోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఒక్క సారి ఎన్నికల్లో పోటీ చేశారు అంటే చాలు కోట్లు ఖర్చు చేయక తప్పదు ప్రతి అభ్యర్థులు.  ఇక ప్రతి ఎన్నికల్లో కూడా ఇలా డబ్బులు పంచడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే డబ్బు లేని రాజకీయాలు ఉంటాయో అప్పుడే ప్రజాస్వామ్యం బతికినట్టు అని చెబుతూ ఉంటారు విశ్లేషకులు. డబ్బులు పంచి ఆ తర్వాత వచ్చిన ఓట్లతో గెలిస్తే అది గెలుపు గెలుపె కాదు అని చెబుతూ ఉంటారు.



 అయితే అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎలాంటి ఎన్నికలు జరిగినా డబ్బులు పంచటం కామన్ కానీ ప్రస్తుతం జగన్ కొత్త చరిత్రకు నాంది పలుకుతున్నారా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు.  ఇటీవల ఎన్నికల్లో డబ్బులు పంచకుండానే భారీ మెజారిటీ సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.  తిరుపతి ఉప ఎన్నికల్లో ఎక్కడ జగన్ పార్టీ డబ్బులు పంచ లేదు తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల తోనే తమకు ఓట్లు వస్తాయి అన్న నమ్మకాన్ని పెట్టుకుంది. అనుకున్నట్లుగానే అధికార వైసీపీ నేతలు అందరూ రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించారు ఇక ఇటీవల ఫలితాలలో ఏకంగా 2.7 లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి.



 ఇక అంతకుముందు జరిగిన జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో కూడా జగన్ పార్టీ డబ్బులు పంచలేదు. అయితే ఒకవేళ డబ్బులు పంచాలి అని అనుకున్నప్పటికీ అటు ప్రతిపక్ష టీడీపీ పూర్తిగా పరిషత్ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడంతో ఇక జగన్ పార్టీకి అసలు పోటీ లేకుండా పోయింది. దీంతో డబ్బులు పంచాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. ఇలా ఒక రకంగా డబ్బులు పంచకుండానే భారీ మెజారిటీ సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కారణాలు ఏమైనా డబ్బులు పంచకుండా ఇంత భారీ మెజారిటీతో విజయం సాధించడం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే సరికొత్త అధ్యాయం అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: