వ్యాక్సిన్ ల కొరత తీవ్రంగా ఉండటం పై ఆందోళన వ్యక్తం చేస్తూ మహరాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఎంఓఎస్ రఘునాత్ కుచిక్ కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్థన్ కు ఓ లేఖను రాశారు. ఈ లేఖలో కుచిక్ ఆరోగ్యమంత్రికి పలు ప్రశ్నలు వేశారు. ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో వ్యాక్సిన్ లకు ఎక్కువ ధర ఎందుకు..మరియు వ్యాక్సిన్ ల కొరత ఎందుకని రఘునాత్ కుచిక్ కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్థన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా సంక్షోభంలో కేంద్ర రాష్ట్రాలకు ఇస్తున్న వ్యాక్సిన్ ధరల విషయంలో వ్యత్యాసాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా సీరం ఇతర దేశాలకు వ్యాక్సిన్ ను అమ్ముతున్న ధరలకు సంభందించిన పట్టికను పొందుపర్చారు. సౌత్ ఆఫ్రికాకు 369, అమెరికాకు 160,సౌదీ అరేబియాకు389, బంగ్లాదేశ్ కు 269, బ్రెజిల్ కు 233, యూకేకు 222 ధరలకు విక్రయిస్తోంది. అయితే మన దేశంలోని అన్ని రాష్ట్రాలకు రూ.400 గా నిర్ణయించింది.
ఆ తరవాత మళ్లీ దేశంపై ప్రేమ వలకబోస్తున్ననట్టు రూర.300 గా నిర్ణయించింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభన సమయంలోనూ వ్యాక్సిన్ తయారీ కంపెనీలు సొమ్ము చేసుకోవాలనుకుంటున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా మన దేశం కంటే ఇతర దేశాలకే తక్కువ ధరకు వ్యాక్సిన్ అమ్మడం దారుణమని అన్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను తయారు చేసిన సీరం ఇన్స్టిట్యూట్ భారత దేశంలోనే ఉండి మన దేశానికి మొదట వ్యాక్సిన్ అందించడం కర్తవ్యం కాదా అని కడిగి పారేసారు. సీరం లో కేంద్రం రూ.3000 కోట్ల పెట్టుబడులు పెట్టిందని కానీ సీరం విదేయత చూపించకపోవడం ఆశ్చర్యకరమని కుచిక్ లేఖలో పేర్కొన్నారు. ఈ సమస్య కేవలం తయారీ కంపెనీలతో మాత్రమే ఏర్పడలేదని కేంద్రం వల్ల కూడా వచ్చిందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వ్యాక్సిన్ అందించేటప్పుడు రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే సోమవారం సీరం ఇన్స్టిట్యూట్ సీఈఓ అదార్ పూనవల్లాను కోరారు. అంతే కాకుండా మహారాష్ట్ర ప్రభుత్వం రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ను కొనుగోలు చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తోందని తెలిపారు.