బాలయ్య నియోజకవర్గంలో అద్భుతం.. అంతా కలెక్టర్ చలవే?
రోజు రోజుకు ఈ మహమ్మారి వైరస్ కేసులు ప్రజలందరిని ప్రాణభయం కలిగిస్తున్నాయి. ప్రజలు వైరస్ పట్ల అవగాహనతో ఉన్నప్పటికీ రోజురోజుకు వైరస్ కారణం గా మృతి చెందుతున్న వారి సంఖ్య చూస్తూ ఉంటే అందరిలో భయాందోళనలు నిండి పోతున్నాయి ముఖ్యంగా ఈ మధ్య కాలం లో ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతూ ఉండడం అందరినీ ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్రంలో ఏర్పడిన ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు ఇప్పటికే ఎంతో మంది అధికారులు నాయకులు సైతం వినూత్నంగా ఆలోచిస్తూ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.
ఇక ఇటీవల హిందూపురం కలెక్టర్ చేసిన పనికి ప్రశంసలు అందుకున్నాడు. నందమూరి బాలకృష్ణ నియోజకవర్గమైన హిందూపురంలో ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రారంభమైంది. అనంతపురం జిల్లా కలెక్టర్ హిందూపురం సమీపంలోని తూముకుంట వద్దా వేదిక్ ఇస్పాట్ సంస్థ ఏర్పాటు చేసిన ప్లాంట్ లో లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నారు కలెక్టర్. రోజుకి 7 నుంచి 10 కిలో లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఇక ఈ ఆక్సిజన్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ సిలిండర్లు హిందూపురం సహా కదిరి పురం ఆస్పత్రులకు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు కలెక్టర్.