మీ ఆధార్ ఎవరైనా వాడుతున్నారా.. ఇలా తెలుసుకోండి?
ఈ క్రమంలోనే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉంటున్నారు. ఇక అన్ని రకాల కార్యకలాపాలకు ఆధార్ కార్డు ను ఉపయోగిస్తున్నారు అయితే ఆధార్ కార్డ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలి అని సూచిస్తూ ఉంటారు నిపుణులు. ఒకరి ఆధార్‌కార్డు మరొకరు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆధార్ నెంబర్ ద్వారా ఎన్నో నేరాలకు పాల్పడే అవకాశం ఉంది అంటూ హెచ్చరిస్తూ ఉంటారు అయితే మీ ఆధార్ కార్టూను ఎవరైనా ఉపయోగిస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.
ఎలాగంటే.. Uidai.Gov.in అనే పోర్టల్ ఓపెన్ చేయాలి. ఇక ఆ తర్వాత మై ఆధార్ కార్డ్ సెక్షన్ లోకి వెళ్లి ఆధార్ సర్వీసెస్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఈ క్రమంలోనే ఆధార్ కార్డ్ అథేంటికేషన్ హిస్టరీ పై క్లిక్ చేయాలి. ఆధార్ నెంబర్ క్యాప్చా నొక్కి ఆ తర్వాత సెండ్ ఓటిపి అనే ఆప్షన్ ఎంచుకుని దానిపై క్లిక్ చేయాలి. ఇక ఏ సమయం నుంచి ఏ సమయం వరకు హిస్టరీ కావాలి అన్న సమయాన్ని ఎంచుకున్న తర్వాత ఓటిపి ఎంటర్ చేయాలి ఈ క్రమంలోనే మీరు మీ ఆధార్ కార్డును ఏ సమయంలో ఎక్కడ ఉపయోగించారు అనే విషయం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మీరు ఉపయోగించని సమయానికి ఏదో తెలుసుకుని మీ ఆధార్ కార్డు ఇతరులు ఉపయోగిస్తున్నారా లేదా అని ఎలా తెలుసుకోవచ్చు.